Naadivaamdavegaadaa naagada nemdunu

నాటివాఁడవేకాదా నాకడ నేఁడును
Language

(॥పల్లవి॥)
నాటివాఁడవేకాదా నాకడ నేఁడును
కూటము లింకా గొసరఁగ వలెనా

(॥నాటి॥)
నాకు నావాఁడవై ననిచితి విట్టె
యేకడ నెవ్వరి కెట్టుందువో
ఆకడ వత్సాపహరణమువేళను
జోకగఁ జేసినసుద్దులు వినమా

(॥నాటి॥)
చేరి నామాఁటలే చెల్లించే విట్టే
యేరీతి నెందరి కెటువలెనో
కూరిమి రేపల్లె గోపికలయడనే
తేరె నీగుణము తెలిసితి మిపుడు

(॥నాటి॥)
కాఁగిట నాకునుఁ గరఁగే విట్టే
యేఁగి కడసతుల కేమందువో
లోఁగ కిప్పు డల మేలుమంగఁ గూడితి
వాఁగి శ్రీవేంకటేశ అంతరాత్మవు

(||pallavi||)
nāḍivām̐ḍavegādā nāgaḍa nem̐ḍunu
kūḍamu liṁkā gŏsaram̐ga valĕnā

(||nāḍi||)
nāgu nāvām̐ḍavai nanisidi viṭṭĕ
yegaḍa nĕvvari kĕṭṭuṁduvo
āgaḍa vatsābaharaṇamuveḽanu
jogagam̐ jesinasuddulu vinamā

(||nāḍi||)
seri nāmām̐ṭale sĕlliṁche viṭṭe
yerīdi nĕṁdari kĕḍuvalĕno
kūrimi reballĕ gobigalayaḍane
terĕ nīguṇamu tĕlisidi mibuḍu

(||nāḍi||)
kām̐giḍa nāgunum̐ garam̐ge viṭṭe
yem̐gi kaḍasadula kemaṁduvo
lom̐ga kippu ḍala melumaṁgam̐ gūḍidi
vām̐gi śhrīveṁkaḍeśha aṁtarātmavu