Naadivaamdave raadaa naagu veṟava neegela

నాటివాఁడవె రాదా నాకు వెఱవ నీకేల
Language

(॥పల్లవి॥)
నాటివాఁడవె రాదా నాకు వెఱవ నీకేల
యేఁటికని మావారు యెదురాడఁ గలరా

(॥నాటి॥)
వాకున సరసమాడి వలపులే చల్లేవు
చేకొని యేమి సేసినా జెల్లదా నీకు
లోకములో గొల్లెతల లోనుసేసుకొన్నఁచేత
సేకరముగా నీకుఁ జెల్లదాయనా

(॥నాటి॥)
ముంగిటనే సన్న సేసి మోవిఁదమ్మ చూపేవు
చెంగటఁ గొంగువట్టితే జెల్లదా నీకు
దొంగిలి వారి చీరలు తొడికి తీసిన చేఁత
సింగారరాయఁడ నీకు జెల్లదాయనా

(॥నాటి॥)
సారె న న్నొడఁబరచి చనవిచ్చి కూడితివి
చేరి బలిమి సేసితేఁ జెల్లదా నీకు
దూరుగా రుకుమిణి నెత్తుక వచ్చిన నీచేఁత
చేరువ శ్రీవేంకటేశ చెల్లదాయనా

(||pallavi||)
nāḍivām̐ḍavĕ rādā nāgu vĕṟava nīgela
yem̐ṭigani māvāru yĕdurāḍam̐ galarā

(||nāḍi||)
vāguna sarasamāḍi valabule sallevu
segŏni yemi sesinā jĕlladā nīgu
logamulo gŏllĕdala lonusesugŏnnam̐seda
segaramugā nīgum̐ jĕlladāyanā

(||nāḍi||)
muṁgiḍane sanna sesi movim̐damma sūbevu
sĕṁgaḍam̐ gŏṁguvaṭṭide jĕlladā nīgu
dŏṁgili vāri sīralu tŏḍigi tīsina sem̐ta
siṁgārarāyam̐ḍa nīgu jĕlladāyanā

(||nāḍi||)
sārĕ na nnŏḍam̐barasi sanavichchi kūḍidivi
seri balimi sesidem̐ jĕlladā nīgu
dūrugā rugumiṇi nĕttuga vachchina nīsem̐ta
seruva śhrīveṁkaḍeśha sĕlladāyanā