Naadiro mum(mum?)jedigamkanaana kaddamu valenaa

నాతిరో ముఁ(ముం?)జేతికంకణాన కద్దము వలెనా
Language

(॥పల్లవి॥)
నాతిరో ముఁ(ముం?)జేతికంకణాన కద్దము వలెనా
యీతల నింకానేలే యేడలేని మాటలు

(॥నాతి॥)
మోమునఁ గళలు దేరీ మొగఁడు వద్ద నున్నాఁడు
ఆముక లోన నుంటిరి యప్పటనుండి
కామించి మిమ్ముఁజూడ గక్కన వచ్చితేను
యేమనేవే నాతోను యేడలేనిమాఁటలు

(॥నాతి॥)
పానువు పై దానున్నాఁడు పాదాలొత్తేవు నీవు
వూని చెమటగారీఁ గొప్పూ వీడెను
కానీవే నేఁగంటే నన్నుఁ గడునొడబరిచేవు
యేనాట నేర్చుకొంటివే యేడలేనిమాటలు

(॥నాతి॥)
చేవదేరె నీమోవి శ్రీవేంకటేశుఁడు నాఁడు
కావించి, పచ్చడ మిట్టె కప్పుకొంటిరి
యీవేళ నేరాఁగాను యీతఁ డిట్లెనన్నుఁ గూడె
యేవల్లఁ జెల్లఁబెట్టేవే యేడలేనిమాటలు

(||pallavi||)
nādiro mum̐(muṁ?)jedigaṁkaṇāna kaddamu valĕnā
yīdala niṁkānele yeḍaleni māḍalu

(||nādi||)
momunam̐ gaḽalu derī mŏgam̐ḍu vadda nunnām̐ḍu
āmuga lona nuṁṭiri yappaḍanuṁḍi
kāmiṁchi mimmum̐jūḍa gakkana vachchidenu
yemaneve nādonu yeḍalenimām̐ṭalu

(||nādi||)
pānuvu pai dānunnām̐ḍu pādālŏttevu nīvu
vūni sĕmaḍagārīm̐ gŏppū vīḍĕnu
kānīve nem̐gaṁṭe nannum̐ gaḍunŏḍabarisevu
yenāḍa nersugŏṁṭive yeḍalenimāḍalu

(||nādi||)
sevaderĕ nīmovi śhrīveṁkaḍeśhum̐ḍu nām̐ḍu
kāviṁchi, pachchaḍa miṭṭĕ kappugŏṁṭiri
yīveḽa nerām̐gānu yīdam̐ ḍiṭlĕnannum̐ gūḍĕ
yevallam̐ jĕllam̐bĕṭṭeve yeḍalenimāḍalu