నాటిమాట నాటికాయ నాలితన మిపుడేల
(॥పల్లవి॥)
నాటిమాట నాటికాయ నాలితన మిపుడేల
కూటమి కియ్యకొనవే గురుతాయఁ బనులు
(॥నాటి ॥)
చెప్పినట్టల్లాఁ జేసి చెలువుఁడు వేఁడుకొనె
తప్పలెంచకువే ఇఁకఁ దరుణీ
దప్పిదేరే మోముతోడ దయవుట్ట మాటలాడీ
వుప్పతించి దూరకువే వొనగూడెఁ బనులు
(॥నాటి॥)
ఇచ్చకము నీకుఁ జేసి ఇంటికి వచ్చెనితఁడు
పచ్చిసేయకువే ఇఁకఁబడఁతీ
ఇచ్చె నీకు బాసలెల్ల నిందరుఁ జూడఁగానె
తచ్చనలు మరియేలే తలకూడెఁ బనులు
(॥నాటి॥)
తగవులెల్ల నెరపె తగిలె శ్రీవేంకటేటేశు -
డెగసక్కేన కోపునా ఇందువదన
నగుతానే నినుఁగూడె నయములు వచరించె
వెగటు లిఁకనేఁటికే వేడుకాయఁ బనులు
(||pallavi||)
nāḍimāḍa nāḍigāya nālidana mibuḍela
kūḍami kiyyagŏnave gurudāyam̐ banulu
(||nāḍi ||)
sĕppinaṭṭallām̐ jesi sĕluvum̐ḍu vem̐ḍugŏnĕ
tappalĕṁchaguve im̐kam̐ daruṇī
dappidere momudoḍa dayavuṭṭa māḍalāḍī
vuppadiṁchi dūraguve vŏnagūḍĕm̐ banulu
(||nāḍi||)
ichchagamu nīgum̐ jesi iṁṭigi vachchĕnidam̐ḍu
pachchiseyaguve im̐kam̐baḍam̐tī
ichchĕ nīgu bāsalĕlla niṁdarum̐ jūḍam̐gānĕ
tachchanalu mariyele talagūḍĕm̐ banulu
(||nāḍi||)
tagavulĕlla nĕrabĕ tagilĕ śhrīveṁkaḍeḍeśhu -
ḍĕgasakkena kobunā iṁduvadana
nagudāne ninum̐gūḍĕ nayamulu vasariṁchĕ
vĕgaḍu lim̐kanem̐ṭige veḍugāyam̐ banulu