నాటికి నాఁడు గొత్త నేటికి నేఁడు గొత్త
(॥పల్లవి॥)
నాటికి నాఁడు గొత్త నేటికి నేఁడు గొత్త
నాటకపు దైవమవు నమో నమో
(॥నాటి॥)
సిరుల రుక్మాంగదుచేతి కత్తిధారఁ దొల్లి
వరస ధర్మాంగదుపై వనమాలాయ
హరి నీకృపకలిమి నట్లనే అరులచే
కరిఖడ్గధార నాకుఁ గలువదండాయ
(॥నాటి॥)
మునుప హరిశ్చంద్రు మొనకత్తిధారఁ దొల్లి
పొనిఁగి చంద్రమతికిఁ బూవుదండాయ
వనజాక్ష నీకృపను వరశత్రులెత్తి నట్టి-
ఘనఖడ్గధార నాకుఁ గస్తూరివాటాయ
(॥నాటి॥)
చలపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి
కలుషముఁ బెడఁబాపి కాచినట్టు
అలర శ్రీవేంకటేశ ఆపద లిన్నియుఁ బాపి
యిల నన్నుఁ గాచినది యెన్నఁ గతలాయ
(||pallavi||)
nāḍigi nām̐ḍu gŏtta neḍigi nem̐ḍu gŏtta
nāḍagabu daivamavu namo namo
(||nāḍi||)
sirula rukmāṁgadusedi kattidhāram̐ dŏlli
varasa dharmāṁgadubai vanamālāya
hari nīkṛpagalimi naṭlane arulase
karikhaḍgadhāra nāgum̐ galuvadaṁḍāya
(||nāḍi||)
munuba hariśhchaṁdru mŏnagattidhāram̐ dŏlli
pŏnim̐gi saṁdramadigim̐ būvudaṁḍāya
vanajākṣha nīkṛpanu varaśhatrulĕtti naṭṭi-
ghanakhaḍgadhāra nāgum̐ gastūrivāḍāya
(||nāḍi||)
salabaṭṭi karirāju śharaṇaṁṭe vichchesi
kaluṣhamum̐ bĕḍam̐bābi kāsinaṭṭu
alara śhrīveṁkaḍeśha ābada linniyum̐ bābi
yila nannum̐ gāsinadi yĕnnam̐ gadalāya