Naadenu nee koorimi naarasimhaa

నాటెను నీ కూరిమి నారసింహా
Language

(॥పల్లవి॥)
నాటెను నీ కూరిమి నారసింహా
నాటకములెల్లాఁ గంటి నారసింహా

(॥నాటె॥)
కోమలు లిందరు నీపైఁ గోరి సేసలు చల్లంగ
నామొగ మేమిచూచేవు నారసింహా
వేమరు వాడవారెల్లా విన్నపాలు సేయఁగాను
నామాటే చవులాయ నారసింహా

(॥నాటె ॥)
యేతులఁ జెంచెత నీతో నేకతమాడినసుద్ది
నాతో దాఁచఁగనేల నారసింహా
జాతులఁ బెట్టుచు నీవు సారెనేల చెనకేవు
నాతుల నీకేమిబాఁతి నారసింహా

(॥నాటె॥)
పనితో నిద్దరమునుఁ బాయక కూడుండఁగా
ననిచె మనపొందులు నారసింహా
తనిసి నీరతుల దయఁజూచి యేలితివి
నను శ్రీవేంకటగిరి నారసింహా

(||pallavi||)
nāḍĕnu nī kūrimi nārasiṁhā
nāḍagamulĕllām̐ gaṁṭi nārasiṁhā

(||nāḍĕ||)
komalu liṁdaru nībaim̐ gori sesalu sallaṁga
nāmŏga memisūsevu nārasiṁhā
vemaru vāḍavārĕllā vinnabālu seyam̐gānu
nāmāḍe savulāya nārasiṁhā

(||nāḍĕ ||)
yedulam̐ jĕṁchĕda nīdo negadamāḍinasuddi
nādo dām̐sam̐ganela nārasiṁhā
jādulam̐ bĕṭṭusu nīvu sārĕnela sĕnagevu
nādula nīgemibām̐ti nārasiṁhā

(||nāḍĕ||)
panido niddaramunum̐ bāyaga kūḍuṁḍam̐gā
nanisĕ manabŏṁdulu nārasiṁhā
tanisi nīradula dayam̐jūsi yelidivi
nanu śhrīveṁkaḍagiri nārasiṁhā