నాటకమునకు మాతో నవ్వేవు గాక
(॥పల్లవి॥)
నాటకమునకు మాతో నవ్వేవు గాక
మాటమాత్రపువారిని మన్నించేవా
(॥నాట॥)
అంటి వూడిగాలు సేసేఅతివలు నీకుండఁగా
యింటిలో సతులపొందు యింపు వుట్టీనా
దంటలై నసతు లెల్లా దగ్గరి కొసరఁగాను
వెంట వచ్చేగుట్టుతోడివెలఁదుల మెచ్చేవా
(॥నాట॥)
పోరచి వెట్టే వారు పొరుగున నుండఁగాను
మేరతోడికామినుల మేకొనేవా
సారెఁ దరితీవు సేసేసతులు పై కొనఁగాను
ఆరీతి కాంతలపై నాస వుట్టీనా
(॥నాట॥)
సన్నలనే యెలయించేతులు కామ కియ్యఁగా
పన్ని పట్టపుదేవుళ్ళు బాఁతయ్యేరా
యిన్నిటా శ్రీ వేంకటేశ యిటు నన్ను నేలితివి
వున్న వారిమీఁద నీకు నున్నదా మనసు
(||pallavi||)
nāḍagamunagu mādo navvevu gāga
māḍamātrabuvārini manniṁchevā
(||nāḍa||)
aṁṭi vūḍigālu seseadivalu nīguṁḍam̐gā
yiṁṭilo sadulabŏṁdu yiṁpu vuṭṭīnā
daṁṭalai nasadu lĕllā daggari kŏsaram̐gānu
vĕṁṭa vachcheguṭṭudoḍivĕlam̐dula mĕchchevā
(||nāḍa||)
porasi vĕṭṭe vāru pŏruguna nuṁḍam̐gānu
meradoḍigāminula megŏnevā
sārĕm̐ daridīvu sesesadulu pai kŏnam̐gānu
ārīdi kāṁtalabai nāsa vuṭṭīnā
(||nāḍa||)
sannalane yĕlayiṁchedulu kāma kiyyam̐gā
panni paṭṭabudevuḽḽu bām̐tayyerā
yinniḍā śhrī veṁkaḍeśha yiḍu nannu nelidivi
vunna vārimīm̐da nīgu nunnadā manasu