Naadagamulivi gonni nadabeem gaaga

నాటకములివి గొన్ని నడపీఁ గాక
Language

(॥పల్లవి॥)
నాటకములివి గొన్ని నడపీఁ గాక
కూటమిఁ గపటమట కోరిక చవౌనా

(॥నాట॥)
మనసోక్కటైతేఁ గా మాట లోక్కటయ్యేది
యెనయవిపొందులకు నేఁటిమాటలే
చనవు గలిగితేఁగా సరసా లింపయ్యేది
మునుపనే కోపమట మొక్కులు చవోనా

(॥నాట॥)
నగవు గలితేఁగా నయములు వొదలేది
యెగసక్కెమైనందు కేఁటిమాటలే
మొగమోట గలితేఁగా ముచ్చటలు చెల్లేది
బిగువులే తనకట ప్రేమము చవౌనా

(॥నాట॥)
గొరికొన సొఁకితేగా గుట్లెల్ల వదలేది
యీరుదియ్యఁ బేనువచ్చీ నేఁటిమాఁటలే
ఆరితేరి శ్రీవేంకటాధిపుఁడు నన్నుఁ గూడె
నేరుపులే నిండెనట నీటులు చవొనా

(||pallavi||)
nāḍagamulivi gŏnni naḍabīm̐ gāga
kūḍamim̐ gabaḍamaḍa koriga savaunā

(||nāḍa||)
manasokkaḍaidem̐ gā māḍa lokkaḍayyedi
yĕnayavibŏṁdulagu nem̐ṭimāḍale
sanavu galigidem̐gā sarasā liṁpayyedi
munubane kobamaḍa mŏkkulu savonā

(||nāḍa||)
nagavu galidem̐gā nayamulu vŏdaledi
yĕgasakkĕmainaṁdu kem̐ṭimāḍale
mŏgamoḍa galidem̐gā muchchaḍalu sĕlledi
biguvule tanagaḍa premamu savaunā

(||nāḍa||)
gŏrigŏna sŏm̐kidegā guṭlĕlla vadaledi
yīrudiyyam̐ benuvachchī nem̐ṭimām̐ṭale
ārideri śhrīveṁkaḍādhibum̐ḍu nannum̐ gūḍĕ
nerubule niṁḍĕnaḍa nīḍulu savŏnā