నాటకపు నిన్నుఁ జూచి నవ్వు వచ్చీని
(॥పల్లవి॥)
నాటకపు నిన్నుఁ జూచి నవ్వు వచ్చీని
యేఁటికి వచ్చితి నేను యెంత సేసేవు
(॥నాటక॥)
నిద్దిరించనలెనంటా నీ కురులు దువ్వితేను
వొద్దిఁ బండు మని యాల వొడి వట్టేవు
అద్దొ నీ పదాలు వాడి అట్టె నిన్ను జోకొట్టితే
కొద్ది మీఱ వలపులు గుప్పళించేవు
(॥నాటక॥)
బడలక దీరుమని పాదములు నే నొత్తితే
బడినే పచ్చడము నాపైఁ గుప్పేవు
కడవారు రాకుండా గడియ నేఁ బెట్టితేను
విడిముడి తమకాన చిమ్మి రేఁగేవు
(॥నాటక॥)
ముందరిజడను వాయ ముసుఁగు నేఁ బెట్టితేను
అందులోనే నన్నుఁ గూడి అట్టె మెచ్చేవు
కందువ శ్రీవేంకటేశ కన్నులు నే మూసి తేను
చందముగా రెప్ప లెత్తి సన్న సేసేవూ
(||pallavi||)
nāḍagabu ninnum̐ jūsi navvu vachchīni
yem̐ṭigi vachchidi nenu yĕṁta sesevu
(||nāḍaga||)
niddiriṁchanalĕnaṁṭā nī kurulu duvvidenu
vŏddim̐ baṁḍu mani yāla vŏḍi vaṭṭevu
addŏ nī padālu vāḍi aṭṭĕ ninnu jogŏṭṭide
kŏddi mīṟa valabulu guppaḽiṁchevu
(||nāḍaga||)
baḍalaga dīrumani pādamulu ne nŏttide
baḍine pachchaḍamu nābaim̐ guppevu
kaḍavāru rāguṁḍā gaḍiya nem̐ bĕṭṭidenu
viḍimuḍi tamagāna simmi rem̐gevu
(||nāḍaga||)
muṁdarijaḍanu vāya musum̐gu nem̐ bĕṭṭidenu
aṁdulone nannum̐ gūḍi aṭṭĕ mĕchchevu
kaṁduva śhrīveṁkaḍeśha kannulu ne mūsi tenu
saṁdamugā rĕppa lĕtti sanna sesevū