Naadagaalu boodagaalu naadone valenaa

నాటకాలు బూటకాలు నాతోనే వలెనా
Language

(॥పల్లవి॥)
నాటకాలు బూటకాలు నాతోనే వలెనా
నీటుతోడ నీ సుద్దులు నే నెఱఁగనా

(॥నాట॥)
తళుకున నాపెఁజూచి తలవంచుకొంటివిని
వలన నాసపడనవానివలెనె
తలఁపులో నారూపు తలపోసి తలపోసి
నెలకొని కరఁగేది నే నెఱఁగనా

(॥నాట॥)
ఆకెమాట చెవుల విననట్టె మారుమాటాడవు
నాకు నా కొప్పగించినవానివలెనె
చేకొని యీపరాకున సిగ్గులమాట లూహించి
నీకునీకె సుకించేది నే నెఱఁగనా

(॥నాట॥)
నీమీఁద నాపె చేచాఁచ నీవు నాపైఁ జేచాఁచేవు
వాములుగా నన్నుఁ గూడేవానివలెనే
యీమై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నీమన సాడ నుండుట నే నెఱఁగనా

(||pallavi||)
nāḍagālu būḍagālu nādone valĕnā
nīḍudoḍa nī suddulu ne nĕṟam̐ganā

(||nāḍa||)
taḽuguna nābĕm̐jūsi talavaṁchugŏṁṭivini
valana nāsabaḍanavānivalĕnĕ
talam̐pulo nārūbu talabosi talabosi
nĕlagŏni karam̐gedi ne nĕṟam̐ganā

(||nāḍa||)
āgĕmāḍa sĕvula vinanaṭṭĕ mārumāḍāḍavu
nāgu nā kŏppagiṁchinavānivalĕnĕ
segŏni yībarāguna siggulamāḍa lūhiṁchi
nīgunīgĕ sugiṁchedi ne nĕṟam̐ganā

(||nāḍa||)
nīmīm̐da nābĕ sesām̐sa nīvu nābaim̐ jesām̐sevu
vāmulugā nannum̐ gūḍevānivalĕne
yīmai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nīmana sāḍa nuṁḍuḍa ne nĕṟam̐ganā