Naabai battigalamdu naa magamdu

నాపై బత్తిగలఁడు నా మగఁడు
Language

(॥పల్లవి॥)
నాపై బత్తిగలఁడు నా మగఁడు
యే పొద్దూ నాకిట్టే చనవిచ్చీఁ గాని

(॥నాపై॥)
పరాకు శాయకుమను భావించి నావిన్నపము
సరుగ నూఁకొనుమను చన విమను
మరిగితినను తనమాటఁలోనిదాననను
గరుణించి తానే నన్నుఁగైకోనీఁగాని

(॥నాపై॥)
దక్కితి నేనను మరి తానే నాకు గతియను
దిక్కు నాకై వుండుమను దేవులనను
మొక్కితినను చూచే ముంగిటికి రమ్మను
అక్కరతోడుతఁదానే యాదరించీఁగాని

(॥నాపై॥)
అట్టె మేనదాననను యలమేల్మంగ నేనను
గుట్టున మందాననను కోమలినను
యిట్టె శ్రీవేంకటేశుఁడిందు వచ్చి నన్నుఁ గూడె
చుట్టరిక మింకా నిట్టె చూపీఁ గానీ

(||pallavi||)
nābai battigalam̐ḍu nā magam̐ḍu
ye pŏddū nāgiṭṭe sanavichchīm̐ gāni

(||nābai||)
parāgu śhāyagumanu bhāviṁchi nāvinnabamu
saruga nūm̐kŏnumanu sana vimanu
marigidinanu tanamāḍam̐lonidānananu
garuṇiṁchi tāne nannum̐gaigonīm̐gāni

(||nābai||)
dakkidi nenanu mari tāne nāgu gadiyanu
dikku nāgai vuṁḍumanu devulananu
mŏkkidinanu sūse muṁgiḍigi rammanu
akkaradoḍudam̐dāne yādariṁchīm̐gāni

(||nābai||)
aṭṭĕ menadānananu yalamelmaṁga nenanu
guṭṭuna maṁdānananu komalinanu
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍiṁdu vachchi nannum̐ gūḍĕ
suṭṭariga miṁkā niṭṭĕ sūbīm̐ gānī