(॥పల్లవి॥)
నాపై బత్తిగలఁడు నా మగఁడు
యేపున మీరేల దూరే రించుక వోరువరే
(॥నాప॥)
వలపు బూమిలో లేదా వలననేరఁడా తాను
చలములేమిటికో సాదించీఁగాక
మొలకలెత్తెఁ జన్నులు మోచుకుందాన వయసు
తెలుకొందము తన తెఱఁగు లిన్నియును
(॥నాప॥)
నవ్వులేమి కఱవా నవ్వనేరఁడా తాను
తవ్వీనేలో ఇసుకపాఁతరలు తాను
వువ్విళ్లూరీ మోవిఁ దేనె వుబ్బీ మదనకళలు
రవ్వగాఁ జూతము తనరాజస మంతయును
(॥నాప॥)
కాఁగిలేమి దవ్వా కలయకున్నాఁడా తాను
లోఁగక సిగ్గులేఁటికో లోఁచీ నేఁడు
యేఁగ కలమేల్‌మంగను ఇట్టె శ్రీవేంకటేశుఁడు
చేఁగదేర నన్నుఁగూడె చెలఁగుద మిఁకను
(||pallavi||)
nābai battigalam̐ḍu nā magam̐ḍu
yebuna mīrela dūre riṁchuga voruvare
(||nāba||)
valabu būmilo ledā valananeram̐ḍā tānu
salamulemiḍigo sādiṁchīm̐gāga
mŏlagalĕttĕm̐ jannulu mosuguṁdāna vayasu
tĕlugŏṁdamu tana tĕṟam̐gu linniyunu
(||nāba||)
navvulemi kaṟavā navvaneram̐ḍā tānu
tavvīnelo isugabām̐taralu tānu
vuvviḽlūrī movim̐ denĕ vubbī madanagaḽalu
ravvagām̐ jūdamu tanarājasa maṁtayunu
(||nāba||)
kām̐gilemi davvā kalayagunnām̐ḍā tānu
lom̐gaga siggulem̐ṭigo lom̐sī nem̐ḍu
yem̐ga kalamelmaṁganu iṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍu
sem̐gadera nannum̐gūḍĕ sĕlam̐guda mim̐kanu