Naabai battigala vamtaa nammidi nenu

నాపై బత్తిగల వంటా నమ్మితి నేను
Language

(॥పల్లవి॥)
నాపై బత్తిగల వంటా నమ్మితి నేను
బాపు బాపు నీ కప్పటిపై కొస రెవ్వతెరా

(॥॥)
తెరమరఁగున నుండి తీగెవార నెలుఁగించి
గరిమ నీవు రా నెఱుకలు సేసీని
సరుస నే నుండఁగా సన్నలా చాయలా నిన్ను
పెర రేఁచి రతులకుఁ బ్రియురాలెవ్వతెరా

(॥॥)
నెమ్మి గంబము మాటున నిలుచుండి వలపులు
తమ్మి పూవులను వేసి తలఁపించీని
అమ్మరో సరసము నే నాడఁగా నీతోడన
యెమ్మెలెల్లాఁ బచరించీ నిదియూ నెవ్వతెరా

(॥॥)
తలుపు దండనే వుండి తరితీపు నవ్వు నవ్వి
కలయికలకుఁ దాను కన్నులార్చీని
అలమేల్మంగను నేను అట్టే శ్రీ వేంకటేశ్వర
కలసితి విటు నన్నుఁ గామిని యెవ్వతెరా

(||pallavi||)
nābai battigala vaṁṭā nammidi nenu
bābu bābu nī kappaḍibai kŏsa rĕvvadĕrā

(||||)
tĕramaram̐guna nuṁḍi tīgĕvāra nĕlum̐giṁchi
garima nīvu rā nĕṟugalu sesīni
sarusa ne nuṁḍam̐gā sannalā sāyalā ninnu
pĕra rem̐si radulagum̐ briyurālĕvvadĕrā

(||||)
nĕmmi gaṁbamu māḍuna nilusuṁḍi valabulu
tammi pūvulanu vesi talam̐piṁchīni
ammaro sarasamu ne nāḍam̐gā nīdoḍana
yĕmmĕlĕllām̐ basariṁchī nidiyū nĕvvadĕrā

(||||)
talubu daṁḍane vuṁḍi taridību navvu navvi
kalayigalagum̐ dānu kannulārsīni
alamelmaṁganu nenu aṭṭe śhrī veṁkaḍeśhvara
kalasidi viḍu nannum̐ gāmini yĕvvadĕrā