Naabai batti galamdu nannu mannimchee nidamdu

నాపై బత్తి గలఁడు నన్ను మన్నించీ నితఁడు
Language

(॥పల్లవి॥)
నాపై బత్తి గలఁడు నన్ను మన్నించీ నితఁడు
రేపు మాపుఁ జింత లిఁక రేఁచకురే మీరు

(॥నాపై॥)
చెలిమి సేసినవాఁడు సేవ గొనకుండునా
పలుమారు పతికిఁ జెప్పుకురే మీరు
వలపించినట్టివాఁడు వాడిక లెరఁగఁడా
బలిమిసేసి కొంగువట్టకురే మీరు

(॥నాపై॥)
యింటికి వచ్చినవాఁడు యెనయక వుండునా
అంటి ముట్టి సారె సొలయకురే మీరు
జంటయై పాయనివాఁడు చనవెల్లా నియ్యఁడా
దంటతనాన నేమీఁ దడవకురే మీరు

(॥నాపై॥)
నమ్మిక లిచ్చినవాఁడు నన్ను నేలకుండునా
కమ్మటిఁ గమ్మిటిఁ బెనఁగకురే మీరు
ఇమ్ముల శ్రీవేంకటేశుఁ డిటు వచ్చి నన్నుఁ గూడె
చిమ్ముఁగొనగోళ్ల సన్న సేయకురే మీరు

(||pallavi||)
nābai batti galam̐ḍu nannu manniṁchī nidam̐ḍu
rebu mābum̐ jiṁta lim̐ka rem̐sagure mīru

(||nābai||)
sĕlimi sesinavām̐ḍu seva gŏnaguṁḍunā
palumāru padigim̐ jĕppugure mīru
valabiṁchinaṭṭivām̐ḍu vāḍiga lĕram̐gam̐ḍā
balimisesi kŏṁguvaṭṭagure mīru

(||nābai||)
yiṁṭigi vachchinavām̐ḍu yĕnayaga vuṁḍunā
aṁṭi muṭṭi sārĕ sŏlayagure mīru
jaṁṭayai pāyanivām̐ḍu sanavĕllā niyyam̐ḍā
daṁṭadanāna nemīm̐ daḍavagure mīru

(||nābai||)
nammiga lichchinavām̐ḍu nannu nelaguṁḍunā
kammaḍim̐ gammiḍim̐ bĕnam̐gagure mīru
immula śhrīveṁkaḍeśhum̐ ḍiḍu vachchi nannum̐ gūḍĕ
simmum̐gŏnagoḽla sanna seyagure mīru