నాపై బత్తి గలఁడే నావిభుఁడు
(॥పల్లవి॥)
నాపై బత్తి గలఁడే నావిభుఁడు
యేపొద్దూ నా సంతోస మేమని చెప్పుదునే
(॥నాపై॥)
చెనకక తనతోను సిగ్గువడి నే నుండఁగా
మనసిచ్చి తానే నాతో మాటలాడీనే
తనివొంది నాలో నేనే తలవంచుకుండఁగాను
చనవిచ్చి యప్పటిని సరసములాడీనే
(॥నాపై॥)
చాయసేసుక కంబముచాటున నే నుండఁగాను
చేయివట్టి తీసి నాచెక్కు నొక్కీనే
కాయమెల్లా పయ్యదను కప్పుకొని వుండఁగాను
ఆయములంటి నన్ను నాదరించీనే
(॥నాపై॥)
వేడుకతోఁ దనవొద్ద వేళగాచుకుండఁగాను
వాడుదేర నింత నన్ను వలపించీనే
యీడనే శ్రీవేంకటేశుఁ డెదుట నే నుండఁగాను
కూడి నన్ను నిందరిలో కొంకక యీడేర్చెనే
(||pallavi||)
nābai batti galam̐ḍe nāvibhum̐ḍu
yebŏddū nā saṁtosa memani sĕppudune
(||nābai||)
sĕnagaka tanadonu sigguvaḍi ne nuṁḍam̐gā
manasichchi tāne nādo māḍalāḍīne
tanivŏṁdi nālo nene talavaṁchuguṁḍam̐gānu
sanavichchi yappaḍini sarasamulāḍīne
(||nābai||)
sāyasesuga kaṁbamusāḍuna ne nuṁḍam̐gānu
seyivaṭṭi tīsi nāsĕkku nŏkkīne
kāyamĕllā payyadanu kappugŏni vuṁḍam̐gānu
āyamulaṁṭi nannu nādariṁchīne
(||nābai||)
veḍugadom̐ danavŏdda veḽagāsuguṁḍam̐gānu
vāḍudera niṁta nannu valabiṁchīne
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍĕduḍa ne nuṁḍam̐gānu
kūḍi nannu niṁdarilo kŏṁkaga yīḍersĕne