Naabaalidi devulavaa naduma neevu

నాపాలిటి దేవులవా నడుమ నీవు
Language

(॥పల్లవి॥)
నాపాలిటి దేవులవా నడుమ నీవు
యేపున నలమేల్మంగ నెరుఁగవా నన్నును

(॥నాపా॥)
కాంతుఁడు మోహించెనంటా కప్రము నీకు నంపెనంటా
ఎంత యెమ్మెలు చెప్పేవే యిందరితోను
బంతి నేలేవాఁడు వొలపక్షము సేయఁగ రాక
వంతు వరుస లిచ్చితే వచ్చెనటే పగటు

(॥నాపా॥)
సారె నిన్నుఁ జూచెనంటా చన్నులంటె నంటాను
యీరీతి నెంత నవ్వేవె యిందరిలోన
వూరకే పొత్తులమగఁ డొద్దనుండఁగా బొరుగు-
పోరచి నిన్నొరసితే పొందెనటే సిరులు

(॥నాపా॥)
వూడిగము గొనెనంటా వొగిఁ గాఁగిలించెనంటా
వేడుక నెంత చూపేవే వెస మాతోను
యీడనె శ్రీవేంకటేశుఁడేవె నన్ను నిన్నూ నేలీ
తోడఁ బెండ్లికూఁతురంటే తొర్లెనటే వావులు

(||pallavi||)
nābāliḍi devulavā naḍuma nīvu
yebuna nalamelmaṁga nĕrum̐gavā nannunu

(||nābā||)
kāṁtum̐ḍu mohiṁchĕnaṁṭā kapramu nīgu naṁpĕnaṁṭā
ĕṁta yĕmmĕlu sĕppeve yiṁdaridonu
baṁti nelevām̐ḍu vŏlabakṣhamu seyam̐ga rāga
vaṁtu varusa lichchide vachchĕnaḍe pagaḍu

(||nābā||)
sārĕ ninnum̐ jūsĕnaṁṭā sannulaṁṭĕ naṁṭānu
yīrīdi nĕṁta navvevĕ yiṁdarilona
vūrage pŏttulamagam̐ ḍŏddanuṁḍam̐gā bŏrugu-
porasi ninnŏraside pŏṁdĕnaḍe sirulu

(||nābā||)
vūḍigamu gŏnĕnaṁṭā vŏgim̐ gām̐giliṁchĕnaṁṭā
veḍuga nĕṁta sūbeve vĕsa mādonu
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ḍevĕ nannu ninnū nelī
toḍam̐ bĕṁḍligūm̐turaṁṭe tŏrlĕnaḍe vāvulu