Naabaadidaanavaa naanaareedula neevu

నాపాటిదానవా నానారీతుల నీవు
Language

(॥పల్లవి॥)
నాపాటిదానవా నానారీతుల నీవు
యేపున నీ మనసులో నెంచి చూచుకొనవే

(॥నాపా॥)
మగఁడు మన్నించునంటా మాఁట జవదాఁటఁడంటా
పగటు లేమి చెప్పేవే పలుమారును
బిగువులు చూపుకొంటా పెద్దకొప్పు వెట్టుకొంటా
నగువు లెంత నవ్వేవే నడుమ నీవు

(॥నాపా॥)
చక్కని దాననంటా సరిగె గలదంటాను
వెక్కాసి వెంతైతివే వెల్లివిరితో
నిక్కి నిక్కి చూచుకొంటా నీటులు నెరపుకొంటా
చొక్కి యేమి మురిసేవే జూటరివై నీవు

(॥నాపా॥)
పాయపు దాననంటా బలిమి కత్తెనంటా
మాయలేమి సేసేవే మతకానను
యీయెడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
ఆయము లేలంటేవే యాతని ముట్టి నీవు

(||pallavi||)
nābāḍidānavā nānārīdula nīvu
yebuna nī manasulo nĕṁchi sūsugŏnave

(||nābā||)
magam̐ḍu manniṁchunaṁṭā mām̐ṭa javadām̐ṭam̐ḍaṁṭā
pagaḍu lemi sĕppeve palumārunu
biguvulu sūbugŏṁṭā pĕddagŏppu vĕṭṭugŏṁṭā
naguvu lĕṁta navveve naḍuma nīvu

(||nābā||)
sakkani dānanaṁṭā sarigĕ galadaṁṭānu
vĕkkāsi vĕṁtaidive vĕllivirido
nikki nikki sūsugŏṁṭā nīḍulu nĕrabugŏṁṭā
sŏkki yemi muriseve jūḍarivai nīvu

(||nābā||)
pāyabu dānanaṁṭā balimi kattĕnaṁṭā
māyalemi seseve madagānanu
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
āyamu lelaṁṭeve yādani muṭṭi nīvu