Naa yamtane vuddamdambuna nee nagaru sochchi sodhimchamga ledu

నా యంతనే వుద్దండంబున నీ నగరు చొచ్చి సోధించఁగ లేదు
Language

(॥పల్లవి॥)
నా యంతనే వుద్దండంబున నీ నగరు చొచ్చి సోధించఁగ లేదు
పాయక నను మన్నించి యేలుకో నీ ప్రకాశ మౌట మేలు

(॥నాయంత॥)
ధరలో నీ రూపము నీవే దాఁచుకొని యుండఁగను
గరుడధ్వజమే నీ గుఱుతు కనుపించెను నాకు
బిరుదులు వొగడే శృతులచేతనే పరరేఁగితి నేను
పరగిన నీ ప్రతాపతేజమె బయలుసేసె నిన్ను

(॥నాయంత॥)
యెవ్వరికి నసాధ్యుఁడవై నీవు యేకతమున నుండఁగాను
రవ్వసేసి నిను నాకుఁ దెలిపెను రచనల నీ మహిమె
చువ్వన నీ విచ్చు వరదహస్తమె చొప్పుచూపఁగాఁ గంటిని
నివ్వటిల్లు నీ కరుణ యిందరికి ని న్నిటువలెనే ముంగిటఁ బెట్టె

(॥నాయంత॥)
శ్రీవేంకటగిరిపై రహస్యమునఁ జెలఁగుచు నుండఁగాను
భావింప నలమేల్మంగ సంపదలె పట్టిచ్చెను నీ ప్రభావము
దైవికమునఁ బ్రకటించిన తొంటివుదారగుణము వినిశరణుచొచ్చితిమి
యీవల నావల మీ చిహ్నములే యింత సేసె మిమ్ము

(||pallavi||)
nā yaṁtane vuddaṁḍaṁbuna nī nagaru sŏchchi sodhiṁcham̐ga ledu
pāyaga nanu manniṁchi yelugo nī pragāśha mauḍa melu

(||nāyaṁta||)
dharalo nī rūbamu nīve dām̐sugŏni yuṁḍam̐ganu
garuḍadhvajame nī guṟudu kanubiṁchĕnu nāgu
birudulu vŏgaḍe śhṛtulasedane pararem̐gidi nenu
paragina nī pradābadejamĕ bayalusesĕ ninnu

(||nāyaṁta||)
yĕvvarigi nasādhyum̐ḍavai nīvu yegadamuna nuṁḍam̐gānu
ravvasesi ninu nāgum̐ dĕlibĕnu rasanala nī mahimĕ
suvvana nī vichchu varadahastamĕ sŏppusūbam̐gām̐ gaṁṭini
nivvaḍillu nī karuṇa yiṁdarigi ni nniḍuvalĕne muṁgiḍam̐ bĕṭṭĕ

(||nāyaṁta||)
śhrīveṁkaḍagiribai rahasyamunam̐ jĕlam̐gusu nuṁḍam̐gānu
bhāviṁpa nalamelmaṁga saṁpadalĕ paṭṭichchĕnu nī prabhāvamu
daivigamunam̐ bragaḍiṁchina tŏṁṭivudāraguṇamu viniśharaṇusŏchchidimi
yīvala nāvala mī sihnamule yiṁta sesĕ mimmu