(॥పల్లవి॥)
నా యంతటిదానవా నడుమ నీవు
ఆయలేవే యేమిచెప్పే వారడి నీ సుద్దులు
(॥నాయం॥)
మక్కువలు వెదచల్లి మాఁటలనే కరఁగించి
దక్కఁగొంటివే పతిని తరుణి నీవు
పక్కన నేనైతేను పాదరము తొక్కుడులనే
చొక్కించి నాయింటికిఁ దెచ్చుకొంటి నే నితని
(॥నాయం॥)
సరసములాడి మోవిచవులు చూపి చూపి
మరిగించుకొటివౌనే మగని నీవు
సొరిది నేనైతేఁ గనుచూపులనే యెలయించి
తరితీపులఁబెట్టి పంత మిప్పించుకొంటిని
(॥నాయం॥)
వూరకే చన్నుల నొత్తి వొడిఁగట్టి వలపులు
కూరిమి రతికిఁ దెచ్చుకొంటిని(వి?) తని
గారవించి నేనైతే కాఁగిటిలో సన్నలనే
చేరి యిట్టే పెండ్లాడితి శ్రీవేంకటేశ్వరుని
(||pallavi||)
nā yaṁtaḍidānavā naḍuma nīvu
āyaleve yemisĕppe vāraḍi nī suddulu
(||nāyaṁ||)
makkuvalu vĕdasalli mām̐ṭalane karam̐giṁchi
dakkam̐gŏṁṭive padini taruṇi nīvu
pakkana nenaidenu pādaramu tŏkkuḍulane
sŏkkiṁchi nāyiṁṭigim̐ dĕchchugŏṁṭi ne nidani
(||nāyaṁ||)
sarasamulāḍi movisavulu sūbi sūbi
marigiṁchugŏḍivaune magani nīvu
sŏridi nenaidem̐ ganusūbulane yĕlayiṁchi
taridībulam̐bĕṭṭi paṁta mippiṁchugŏṁṭini
(||nāyaṁ||)
vūrage sannula nŏtti vŏḍim̐gaṭṭi valabulu
kūrimi radigim̐ dĕchchugŏṁṭini(vi?) tani
gāraviṁchi nenaide kām̐giḍilo sannalane
seri yiṭṭe pĕṁḍlāḍidi śhrīveṁkaḍeśhvaruni