నా వొళ్ల గల్లలేదు నామాట నాకుఁ జెల్లె
(॥పల్లవి॥)
నా వొళ్ల గల్లలేదు నామాట నాకుఁ జెల్లె
ఆవేళ నీకుఁ దీరదాయఁ జుమ్మీ విభుఁడా
(॥నావొ॥)
పవళించి చంద్రగావిపచ్చడముసుగుతో
జవళి నాపెయు నీవు సరినుండగా
ఇవల నప్పుడు నిన్ను యెరుకసేసుకోఁ గాని
తివిరి వచ్చితి జుమ్మీ దేవరవద్దికిని
(॥నావొ॥)
తలవీడి మొలవీడి దంతపుటోవరిలోన
అలమినాపెయు నీవు నట్లుండగా
పలికించి నిన్నప్పుడు పచరించనైతిఁ గాని
నిలిచి చూచితిజుమ్మీ నీమొగము నేను
(॥నావొ॥)
చిత్తజకేలిని మీరు సిగ్గువిడిచుండఁగా
హత్తి శ్రీ వేంకటేశ నిన్నలమితిని
పొత్తుల గూడితి విట్టె పూఁచి పేరు చెప్పఁ గాని
తత్తరించనైతి జుమ్మీ దండనే వుందానను
(||pallavi||)
nā vŏḽla gallaledu nāmāḍa nāgum̐ jĕllĕ
āveḽa nīgum̐ dīradāyam̐ jummī vibhum̐ḍā
(||nāvŏ||)
pavaḽiṁchi saṁdragāvibachchaḍamusugudo
javaḽi nābĕyu nīvu sarinuṁḍagā
ivala nappuḍu ninnu yĕrugasesugom̐ gāni
tiviri vachchidi jummī devaravaddigini
(||nāvŏ||)
talavīḍi mŏlavīḍi daṁtabuḍovarilona
alaminābĕyu nīvu naṭluṁḍagā
paligiṁchi ninnappuḍu pasariṁchanaidim̐ gāni
nilisi sūsidijummī nīmŏgamu nenu
(||nāvŏ||)
sittajagelini mīru sigguviḍisuṁḍam̐gā
hatti śhrī veṁkaḍeśha ninnalamidini
pŏttula gūḍidi viṭṭĕ pūm̐si peru sĕppam̐ gāni
tattariṁchanaidi jummī daṁḍane vuṁdānanu