Naa vojale ramanumda nannu nimtaseseemgaaga

నా వోజలే రమణుఁడ నన్ను నింతసేసీఁగాక
Language

(॥పల్లవి॥)
నా వోజలే రమణుఁడ నన్ను నింతసేసీఁగాక
నీ వొళ్ల నేమైనాను నేరములు గలవా

(॥నావో॥)
హత్తి నీతో నే మాటలాడ సిగ్గువడితేను
చిత్తముతో తమకము చిమ్మిరేఁచీని
మొత్తానఁ గూరిమిదాఁచి మోమువంచుకొంటేను
యెత్తించీఁ గమ్మటిఁ దామే ఇవివో నాయాసలు

(॥నావో॥)
అడఁకువతో నే నాయగ్గలిక మాన్పుకొంటే
నడుమ నావేడుకలు నవ్వించీని
బడినుండే నామనసు పరాకు సేసుకుంటే
బెడిదపుజవ్వనము పెడరేఁచీని

(॥నావో॥)
కదిసి నే వినయానఁ గాఁగిలించుకుండితేను
యిదె నామైమఱపులు యెనయించీని
అదన శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
పొదిగి నాపొందులే బోదించీని

(||pallavi||)
nā vojale ramaṇum̐ḍa nannu niṁtasesīm̐gāga
nī vŏḽla nemainānu neramulu galavā

(||nāvo||)
hatti nīdo ne māḍalāḍa sigguvaḍidenu
sittamudo tamagamu simmirem̐sīni
mŏttānam̐ gūrimidām̐si momuvaṁchugŏṁṭenu
yĕttiṁchīm̐ gammaḍim̐ dāme ivivo nāyāsalu

(||nāvo||)
aḍam̐kuvado ne nāyaggaliga mānpugŏṁṭe
naḍuma nāveḍugalu navviṁchīni
baḍinuṁḍe nāmanasu parāgu sesuguṁṭe
bĕḍidabujavvanamu pĕḍarem̐sīni

(||nāvo||)
kadisi ne vinayānam̐ gām̐giliṁchuguṁḍidenu
yidĕ nāmaimaṟabulu yĕnayiṁchīni
adana śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
pŏdigi nābŏṁdule bodiṁchīni