Naa vinnabamu vinave nalinaakshi

నా విన్నపము వినవే నలినాక్షి
Language

(॥పల్లవి॥)
నా విన్నపము వినవే నలినాక్షి
చేవ మీర నీకు బుద్దిచెప్పితిఁ జుమ్మీ

(॥నావి॥)
చనవరితనమును సాదించుకంటేను
వినయముతో విభుని వేఁడుట మేలు
కనుచూపు నాటఁజూపి కాఁతాళించుకంటేను
మనసు రంజిల్లఁగా మాటాడుటే మేలు

(॥నావి॥)
పంతములు నెరపుచు బయలీఁదించుటకంటే
చెంతనుండి ప్రియములు చెప్పట మేలు
వంతుల నొట్లువెట్టి వలలఁబెట్టుటకంటె
చింతదీర నూడిగాలు సేయుట మేలు

(॥నావి॥)
పల్లదానఁ గాఁగిలించి పచ్చిగాఁ జేయుటకంటె
చల్లఁగా వలపు సారెఁ జల్లుటమేలు
కొల్లఁగా నలమేల్ మంగ కూడె శ్రీవేంకటేశుఁడు
చిల్లరసిగ్గులకంటె చెనకుట మేలు

(||pallavi||)
nā vinnabamu vinave nalinākṣhi
seva mīra nīgu buddisĕppidim̐ jummī

(||nāvi||)
sanavaridanamunu sādiṁchugaṁṭenu
vinayamudo vibhuni vem̐ḍuḍa melu
kanusūbu nāḍam̐jūbi kām̐tāḽiṁchugaṁṭenu
manasu raṁjillam̐gā māḍāḍuḍe melu

(||nāvi||)
paṁtamulu nĕrabusu bayalīm̐diṁchuḍagaṁṭe
sĕṁtanuṁḍi priyamulu sĕppaḍa melu
vaṁtula nŏṭluvĕṭṭi valalam̐bĕṭṭuḍagaṁṭĕ
siṁtadīra nūḍigālu seyuḍa melu

(||nāvi||)
palladānam̐ gām̐giliṁchi pachchigām̐ jeyuḍagaṁṭĕ
sallam̐gā valabu sārĕm̐ jalluḍamelu
kŏllam̐gā nalamel maṁga kūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
sillarasiggulagaṁṭĕ sĕnaguḍa melu