నా విభునితో నేల నగవచ్చేవే
(॥పల్లవి॥)
నా విభునితో నేల నగవచ్చేవే
వావిరి నాకే యితఁడు వసమైయున్నాఁడు
(॥నావి॥)
కొత్త కొత్త మాటలు కొనచూపు తేటలు
హత్తి చెల్లాటాలయాట పాటలు
యెత్తల నేరిచితివో యిటువంటి బిన్నాణాలు
మత్తిలి నీవైతే నిసుమంత దానవు
(॥నావి॥)
పచ్చి పచ్చి చేఁతలు వుబ్బరి బయలీఁతలు
తచ్చన నివ్వెరగుల తలపోఁతలు
గచ్చుల నెన్నాళ్లనుండి గడియించుకొంటివో
కచ్చుపెట్టి నిన్నెంచితే కడు గోలదానవు
(॥నావి॥)
సారె సారె జంకెలు సమరతి యంకెలు
ఆరితేరికూడి పాయనిలంకెలు
యేరీతినబ్బె శ్రీవేంకటేశుతోడి పొందు నీకు
చరి మొలక చన్నుల చిన్నారిదానవు
(||pallavi||)
nā vibhunido nela nagavachcheve
vāviri nāge yidam̐ḍu vasamaiyunnām̐ḍu
(||nāvi||)
kŏtta kŏtta māḍalu kŏnasūbu teḍalu
hatti sĕllāḍālayāḍa pāḍalu
yĕttala nerisidivo yiḍuvaṁṭi binnāṇālu
mattili nīvaide nisumaṁta dānavu
(||nāvi||)
pachchi pachchi sem̐talu vubbari bayalīm̐talu
tachchana nivvĕragula talabom̐talu
gachchula nĕnnāḽlanuṁḍi gaḍiyiṁchugŏṁṭivo
kachchubĕṭṭi ninnĕṁchide kaḍu goladānavu
(||nāvi||)
sārĕ sārĕ jaṁkĕlu samaradi yaṁkĕlu
āriderigūḍi pāyanilaṁkĕlu
yerīdinabbĕ śhrīveṁkaḍeśhudoḍi pŏṁdu nīgu
sari mŏlaga sannula sinnāridānavu