నా రమణునిఁ జూడరే నలినాక్షులాల నేఁడు
(॥పల్లవి॥)
నా రమణునిఁ జూడరే నలినాక్షులాల నేఁడు
గారవముతోడ నన్నుఁ గరుణించీ నిదివో
(॥॥)
మరిగిన యెడాటాన మంకు లేమి రేఁగవు
సరవితోఁ బెనగితే చలము లేదు
తిరమైన పొందులకు తెరమరఁ గెంచవద్దు
నిరతపు వేడుకలే నిండుకొను మతిని
(॥॥)
మొగము చూచినమీఁద మొనయవు కాఁకలు
నగఁ దొడఁ గితే మఱి నాట దలుక
చిగిరించిన వలపు చేగలు దీరకపోదు
మిగులాఁ దమకములే మేనఁ బెనగొనుము
(॥॥)
బలిమిఁ గూడిన తఱిఁ బంతములు వుట్టవు
చెలఁగి యేకతమైతే సిగ్గు మించదు
అలమేల్మంగను నేను అతఁడు శ్రీ వేంకటేశుఁ
డిల నన్ను నేలె నిఁక నిచ్చకమౌ రతులు
(||pallavi||)
nā ramaṇunim̐ jūḍare nalinākṣhulāla nem̐ḍu
gāravamudoḍa nannum̐ garuṇiṁchī nidivo
(||||)
marigina yĕḍāḍāna maṁku lemi rem̐gavu
saravidom̐ bĕnagide salamu ledu
tiramaina pŏṁdulagu tĕramaram̐ gĕṁchavaddu
niradabu veḍugale niṁḍugŏnu madini
(||||)
mŏgamu sūsinamīm̐da mŏnayavu kām̐kalu
nagam̐ dŏḍam̐ gide maṟi nāḍa daluga
sigiriṁchina valabu segalu dīragabodu
migulām̐ damagamule menam̐ bĕnagŏnumu
(||||)
balimim̐ gūḍina taṟim̐ baṁtamulu vuṭṭavu
sĕlam̐gi yegadamaide siggu miṁchadu
alamelmaṁganu nenu adam̐ḍu śhrī veṁkaḍeśhum̐
ḍila nannu nelĕ nim̐ka nichchagamau radulu