Naa ramanumdeleem gaaga naa vala pedi kemcheene

నా రమణుఁడేలీఁ గాక నా వల పేటి కెంచీనే
Language

(॥పల్లవి॥)
నా రమణుఁడేలీఁ గాక నా వల పేటి కెంచీనే
తారుకొన నిద్దరిఁ దా దగ్గరించఁ బొయ్యీనా

(॥నారమణు॥)
కాంతుఁడు రాకుండితేఁ గన్నీ రేల వచ్చీనే
దొంతి నాతనిఁ దా నేమి తోడితెచ్చీనా
చింత నేకతనాన నుంటే చెక్కు లేల చెమరించీ
వంతున నాతఁ డీడకు వచ్చేటట్టు సేసీనా

(॥నారమణు॥)
పతి యిందు రాకుండితే ప్రాణ మేల కలఁగీనే
గతియై యాతని న న్నొక్కటి సేసీనా
చతురుఁడు చూడకుంటే జాలిమా లేల వుట్టీనే
యితవై యాతనిని మా యింటికిఁ దెచ్చీనా

(॥నారమణు॥)
వీనుల నాయకుమాట వింటే మే నేల వొక్కీనే
తా నాతని నాకిట్టే దక్కఁజేసీనా
పానుపుపై నాతఁ డుంటే పైకొనీఁ దమక మేలే
వూని శ్రీవేంకటపతిఁ బోకుండాఁ జేసీనా

(||pallavi||)
nā ramaṇum̐ḍelīm̐ gāga nā vala peḍi kĕṁchīne
tārugŏna niddarim̐ dā daggariṁcham̐ bŏyyīnā

(||nāramaṇu||)
kāṁtum̐ḍu rāguṁḍidem̐ gannī rela vachchīne
dŏṁti nādanim̐ dā nemi toḍidĕchchīnā
siṁta negadanāna nuṁṭe sĕkku lela sĕmariṁchī
vaṁtuna nādam̐ ḍīḍagu vachcheḍaṭṭu sesīnā

(||nāramaṇu||)
padi yiṁdu rāguṁḍide prāṇa mela kalam̐gīne
gadiyai yādani na nnŏkkaḍi sesīnā
sadurum̐ḍu sūḍaguṁṭe jālimā lela vuṭṭīne
yidavai yādanini mā yiṁṭigim̐ dĕchchīnā

(||nāramaṇu||)
vīnula nāyagumāḍa viṁṭe me nela vŏkkīne
tā nādani nāgiṭṭe dakkam̐jesīnā
pānububai nādam̐ ḍuṁṭe paigŏnīm̐ damaga mele
vūni śhrīveṁkaḍabadim̐ boguṁḍām̐ jesīnā