Naa pamtamu leedere nannu mannimchidivi

నా పంతము లీడేరె నన్ను మన్నించితివి
Language

(॥పల్లవి॥)
నా పంతము లీడేరె నన్ను మన్నించితివి
వోపిక నీవేమిచ్చినా వొల్లనన నిఁకను

(॥॥)
మాయింటికి వచ్చితివి మాచే మొక్కించుకొంటివి
నీయింతు లేమైనానననీ యిఁకను
చేయి నీపై వేసితివి చెప్పినట్టు సేసితిని
వేయి చెప్పినా నీసుద్దులు వినే నే నిఁకను

(॥॥)
విందు లారగించితివి వీడె మందుకొంటివి
అందులకే నే నవ్వేను అట్టే ఇఁకను
గందము మైఁ బూసితివి కంకణము గట్టితివి
యెందుకైనా నీ సేఁతకు ఇయ్యకొనే నిఁకను

(॥॥)
నమ్మించితివి నన్ను నాపై సేస వెట్టితివి
వుమ్మడి నొకమనసై వుండే నిఁకను
నెమ్మది శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
సమ్మతి మో విచ్చితివి చవిగొనే నిఁకను

(||pallavi||)
nā paṁtamu līḍerĕ nannu manniṁchidivi
vobiga nīvemichchinā vŏllanana nim̐kanu

(||||)
māyiṁṭigi vachchidivi māse mŏkkiṁchugŏṁṭivi
nīyiṁtu lemainānananī yim̐kanu
seyi nībai vesidivi sĕppinaṭṭu sesidini
veyi sĕppinā nīsuddulu vine ne nim̐kanu

(||||)
viṁdu lāragiṁchidivi vīḍĕ maṁdugŏṁṭivi
aṁdulage ne navvenu aṭṭe im̐kanu
gaṁdamu maim̐ būsidivi kaṁkaṇamu gaṭṭidivi
yĕṁdugainā nī sem̐tagu iyyagŏne nim̐kanu

(||||)
nammiṁchidivi nannu nābai sesa vĕṭṭidivi
vummaḍi nŏgamanasai vuṁḍe nim̐kanu
nĕmmadi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
sammadi mo vichchidivi savigŏne nim̐kanu