Naa momu soosi soosi nannemi buddedigevu

నా మోము చూచి చూచి నన్నెమి బుద్దెడిగేవు
Language

(॥పల్లవి॥)
నా మోము చూచి చూచి నన్నెమి బుద్దెడిగేవు
కాముకునకు నీతి యెక్కడనైనాఁ గలదా

(॥నామో॥)
నెమ్మది నీతో నేను నేరుపుల మాటలాడి
వుమ్మడి వుండేఁ గాని వొరయనోప
కమ్మటి నీకు నిచ్కపుఁ జేఁతలెల్లాఁ జేసి
సమ్మతి మొక్కేఁ గాని సాదించనోప

(॥నామో॥)
అప్పటప్పటికి నీతో సంకెలకు నవ్వు నవ్వి
కొప్పు దువ్వేఁగాని కడుఁ గొసరనోప
యెప్పుడు చూచినా నీకు యెవ్వతెనైనాఁ దెచ్చి
నెప్పున మెప్పించేఁగాని నీరప మెంచనోప

(॥నామో॥)
పూడినట్లనే కూడి కొలువులోపన నీచే
వీడె మందుకొనేఁగాని వెంగనకోప
యీడనే శ్రీవేంకటేశ యేలితివి కడపలో
పాడి నెరపేఁగాని పంగించనోప

(||pallavi||)
nā momu sūsi sūsi nannĕmi buddĕḍigevu
kāmugunagu nīdi yĕkkaḍanainām̐ galadā

(||nāmo||)
nĕmmadi nīdo nenu nerubula māḍalāḍi
vummaḍi vuṁḍem̐ gāni vŏrayanoba
kammaḍi nīgu nichkabum̐ jem̐talĕllām̐ jesi
sammadi mŏkkem̐ gāni sādiṁchanoba

(||nāmo||)
appaḍappaḍigi nīdo saṁkĕlagu navvu navvi
kŏppu duvvem̐gāni kaḍum̐ gŏsaranoba
yĕppuḍu sūsinā nīgu yĕvvadĕnainām̐ dĕchchi
nĕppuna mĕppiṁchem̐gāni nīraba mĕṁchanoba

(||nāmo||)
pūḍinaṭlane kūḍi kŏluvulobana nīse
vīḍĕ maṁdugŏnem̐gāni vĕṁganagoba
yīḍane śhrīveṁkaḍeśha yelidivi kaḍabalo
pāḍi nĕrabem̐gāni paṁgiṁchanoba