నా మోము చూచి చూచి నడుమ నేల కొంకేవు
(॥పల్లవి॥)
నా మోము చూచి చూచి నడుమ నేల కొంకేవు
ఆముకొని మెచ్చఁగా నే నడ్డమాడేనా
(॥॥)
బత్తి గలవాడవు పడఁతి పాట వింటివి
చిత్తము రంజించి నీకు చెవి బట్టెనా
యిత్తల మే చెమరించె నెంత గరఁగెనొ మతి
పొత్తుల వాకుచ్చి యాకెఁ బొగడఁగరాదా
(॥॥)
సరి నిడుకొంటివి చదివించితి వా పెను
తిరమైన యాయర్థము తెలిసితివా
నిరతిఁ బలుకలెల్లా నిండెను సంతోసమెంతో
అరదైనవుడుగర లట్టె ఇయ్యరాదా
(॥॥)
శ్రీవేంకటేశుడు చెలియాట చూచితివి
భావించి నీకు గన్నుల పండుగాయనా
యీవల నన్నేలితివి ఇదెంత జాణతనమో
సేవసేసే మిద్దరము సేసచల్లరాదా
(||pallavi||)
nā momu sūsi sūsi naḍuma nela kŏṁkevu
āmugŏni mĕchcham̐gā ne naḍḍamāḍenā
(||||)
batti galavāḍavu paḍam̐ti pāḍa viṁṭivi
sittamu raṁjiṁchi nīgu sĕvi baṭṭĕnā
yittala me sĕmariṁchĕ nĕṁta garam̐gĕnŏ madi
pŏttula vāguchchi yāgĕm̐ bŏgaḍam̐garādā
(||||)
sari niḍugŏṁṭivi sadiviṁchidi vā pĕnu
tiramaina yāyardhamu tĕlisidivā
niradim̐ balugalĕllā niṁḍĕnu saṁtosamĕṁto
aradainavuḍugara laṭṭĕ iyyarādā
(||||)
śhrīveṁkaḍeśhuḍu sĕliyāḍa sūsidivi
bhāviṁchi nīgu gannula paṁḍugāyanā
yīvala nannelidivi idĕṁta jāṇadanamo
sevasese middaramu sesasallarādā