నా మొగము చూచి యేమి నవ్వులు నవ్వేవు నీవు
(॥పల్లవి॥)
నా మొగము చూచి యేమి నవ్వులు నవ్వేవు నీవు
యీ మఱఁగు లీడేరె నెంత సేసేవు
(॥నామొ॥)
చిత్తరుపతిమవలె చెలి నిలుచుకున్నది
హత్తి దండఁ గూచుండు మనఁగరాదా
బత్తిసేసి నీకు నదె బాగా లందిఇచ్చీని
కొత్తవలపు నీవందుకొనఁగరాదా
(॥నామొ॥)
మేనమఱఁదలి వలె మెలుత సరసమాడీ
వీనులు చల్లఁగా నీవు వినఁగరాదా
ఆనుక గుబ్బల నీకు నాస చూపుకవున్నది
పేనిపట్టి వాఁటితోడఁ బెనఁగరాదా
(॥నామొ॥)
వలరారజుతల్లివలె వనిత నీకుఁ గలిగె
మలసి యన్నిటా నీవు మన్నించరాదా
తలఁపుదెలిసి నన్ను దయఁజూచి యేలితివి
యెలమి శ్రీవేంకటేశ యాకెనూఁ గూడరాదా
(||pallavi||)
nā mŏgamu sūsi yemi navvulu navvevu nīvu
yī maṟam̐gu līḍerĕ nĕṁta sesevu
(||nāmŏ||)
sittarubadimavalĕ sĕli nilusugunnadi
hatti daṁḍam̐ gūsuṁḍu manam̐garādā
battisesi nīgu nadĕ bāgā laṁdiichchīni
kŏttavalabu nīvaṁdugŏnam̐garādā
(||nāmŏ||)
menamaṟam̐dali valĕ mĕluda sarasamāḍī
vīnulu sallam̐gā nīvu vinam̐garādā
ānuga gubbala nīgu nāsa sūbugavunnadi
penibaṭṭi vām̐ṭidoḍam̐ bĕnam̐garādā
(||nāmŏ||)
valarārajudallivalĕ vanida nīgum̐ galigĕ
malasi yanniḍā nīvu manniṁcharādā
talam̐pudĕlisi nannu dayam̐jūsi yelidivi
yĕlami śhrīveṁkaḍeśha yāgĕnūm̐ gūḍarādā