నా మొగము చూచి యేమి నవ్వేవే ఇందుకుఁ గాను
(॥పల్లవి॥)
నా మొగము చూచి యేమి నవ్వేవే ఇందుకుఁ గాను
నీ మగని యెదుటను నిలుచుండఁగదవే
(॥॥)
కన్నులు గొప్పలైతే చక్కఁదనాలకు మేలు
చన్నులు బలిసితేను జవ్వనమునకు మేలు
నిన్ను నీవే యెంచుకొని నీవే సిగ్గువడితే
కన్నెరో నీపతి వచ్చె గక్కన రావే
(॥॥)
ముక్కు గొప్పదైతేను మోమునకు సింగారము
నిక్కినకొప్పయితేను నిలువునకు సింగారము
చెక్కు చేతఁబెట్టుకొని శిరసేల వంచేవే
మక్కువ నీవిభునితో మాటలాడఁగదవే
(॥॥)
నిండుఁ బిరుదైతేను నెన్నడిమి కాదరువు
దండియైన మీఁగాళ్లు తనువు కాదరువు
అండనే శ్రీవేంకటేశుఁడంతలోనె నిన్నుఁగూడె
పండె నీతపము లింకఁ బాదాలకు మొక్కవే
(||pallavi||)
nā mŏgamu sūsi yemi navveve iṁdugum̐ gānu
nī magani yĕduḍanu nilusuṁḍam̐gadave
(||||)
kannulu gŏppalaide sakkam̐danālagu melu
sannulu balisidenu javvanamunagu melu
ninnu nīve yĕṁchugŏni nīve sigguvaḍide
kannĕro nībadi vachchĕ gakkana rāve
(||||)
mukku gŏppadaidenu momunagu siṁgāramu
nikkinagŏppayidenu niluvunagu siṁgāramu
sĕkku sedam̐bĕṭṭugŏni śhirasela vaṁcheve
makkuva nīvibhunido māḍalāḍam̐gadave
(||||)
niṁḍum̐ birudaidenu nĕnnaḍimi kādaruvu
daṁḍiyaina mīm̐gāḽlu tanuvu kādaruvu
aṁḍane śhrīveṁkaḍeśhum̐ḍaṁtalonĕ ninnum̐gūḍĕ
paṁḍĕ nīdabamu liṁkam̐ bādālagu mŏkkave