Naa mogamu soosi nagaraadaa

నా మొగము చూచి నగరాదా
Language

(॥పల్లవి॥)
నా మొగము చూచి నగరాదా
దోమటి గలసే నిందుకు నగరాదా

(॥॥)
చెనకు లాకెచేఁ జేయించకుండితే
నను నీ వప్పుడు నగరాదా
పెనఁగుల జంకింపించకుండితే
యినుమడిగా నీవిటు నగరాదా

(॥॥)
పిలి చటు కొసరింపించకుండితే
నలువంకల మరి నగరాదా
చెలరేఁగి ప్రియము చెప్పించకుండితే
కొలఁదిమీరి గక్కున నగరాదా

(॥॥)
వొట్టి పంతానఁ జెయ్యొగ్గించకుండితే
నట్టనడుమనే నగరాదా
యిట్టె శ్రీ వేంకటేశ కూడితివి
చుట్టమవై మెచ్చుగ నగరాదా

(||pallavi||)
nā mŏgamu sūsi nagarādā
domaḍi galase niṁdugu nagarādā

(||||)
sĕnagu lāgĕsem̐ jeyiṁchaguṁḍide
nanu nī vappuḍu nagarādā
pĕnam̐gula jaṁkiṁpiṁchaguṁḍide
yinumaḍigā nīviḍu nagarādā

(||||)
pili saḍu kŏsariṁpiṁchaguṁḍide
naluvaṁkala mari nagarādā
sĕlarem̐gi priyamu sĕppiṁchaguṁḍide
kŏlam̐dimīri gakkuna nagarādā

(||||)
vŏṭṭi paṁtānam̐ jĕyyŏggiṁchaguṁḍide
naṭṭanaḍumane nagarādā
yiṭṭĕ śhrī veṁkaḍeśha kūḍidivi
suṭṭamavai mĕchchuga nagarādā