నా మేలువాఁడై యాతఁడు నావద్దనే వున్నవాడు
(॥పల్లవి॥)
నా మేలువాఁడై యాతఁడు నావద్దనే వున్నవాడు
యీ మతకములు మరి యిఁక నీకుఁ దగునే
(॥నా మేలు॥)
ఆసలు రేఁచుకొంటా నాకెకు నీతనికిని
రాసికెక్క నే మాడేవే రాయబారాలు
సేసవెట్టిననాపతిఁ జేరి నే నెఱఁగకుండా
మూసి దాఁచి పొందుసేయ మన్నేడ నేర్చితివే
(॥నా మేలు॥)
సన్నలు సేసుకొంటా నారె సారె నిద్దరికి
యెన్నిమారు లందించేవే యెడమాఁటలు
పన్నుక నా కాఁగిటిలో పాయకుండిన యీతని
వన్నెల నెలయించ నే వంకఁ గలిగితివే
(॥నా మేలు॥)
కడనుండి నవ్వుకొంటా గలపే వొకరొకరిఁ
దడవక మానవే నీ తాపితనాలు
యెడయక శ్రీవేంకటేశుఁడు నన్నేలినాఁడు
అడరి నా కితవరివ య్యెట్టు వచ్చితివే
(||pallavi||)
nā meluvām̐ḍai yādam̐ḍu nāvaddane vunnavāḍu
yī madagamulu mari yim̐ka nīgum̐ dagune
(||nā melu||)
āsalu rem̐sugŏṁṭā nāgĕgu nīdanigini
rāsigĕkka ne māḍeve rāyabārālu
sesavĕṭṭinanābadim̐ jeri ne nĕṟam̐gaguṁḍā
mūsi dām̐si pŏṁduseya manneḍa nersidive
(||nā melu||)
sannalu sesugŏṁṭā nārĕ sārĕ niddarigi
yĕnnimāru laṁdiṁcheve yĕḍamām̐ṭalu
pannuga nā kām̐giḍilo pāyaguṁḍina yīdani
vannĕla nĕlayiṁcha ne vaṁkam̐ galigidive
(||nā melu||)
kaḍanuṁḍi navvugŏṁṭā galabe vŏgarŏgarim̐
daḍavaga mānave nī tābidanālu
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ḍu nannelinām̐ḍu
aḍari nā kidavariva yyĕṭṭu vachchidive