Naa marmamittidi yimka nee marmamaanadeeraa

నా మర్మమిట్టిది యిఁక నీ మర్మమానతీరా
Language

(॥పల్లవి॥)
నా మర్మమిట్టిది యిఁక నీ మర్మమానతీరా
యీ మేరఁ జూచినవారి కెంతబంటోయిఁకను

(॥నామ॥)
మక్కువ నీతో నేను మాటలాడినంతలోనే
పుక్కిటిబంటె(టా?) యరా పూఁచి వలపు
చెక్కుల చెమటలెల్లా చెరువుల వానలాయ
యిక్కడ నన్నుఁ జూచి నీకెంతబంటో యిఁకను

(॥నామ॥)
కన్నుల నీరూపుచూచి కరఁగి గుండెలుమోఁచి
చన్నులబంటె(టా?)యరా సరివలపు
వున్నతిఁ మోవితేనియ లువ్విళ్లూరఁగఁ జొచ్చె
యిన్నిటా నా జోడైతి వెంతబంటోయిఁకను

(॥నామ॥)
కలసి నీవద్ద నేను గట్టిపీఁటపై గూచుండి
మొలబంటియాయరా యిమ్ములవలపు
కులికి శ్రీవెంకటేశ కూడితివి వయోమద
మెలిమి మడుగులుబ్బె నెంతబంటోయిఁకను

(||pallavi||)
nā marmamiṭṭidi yim̐ka nī marmamānadīrā
yī meram̐ jūsinavāri kĕṁtabaṁṭoyim̐kanu

(||nāma||)
makkuva nīdo nenu māḍalāḍinaṁtalone
pukkiḍibaṁṭĕ(ṭā?) yarā pūm̐si valabu
sĕkkula sĕmaḍalĕllā sĕruvula vānalāya
yikkaḍa nannum̐ jūsi nīgĕṁtabaṁṭo yim̐kanu

(||nāma||)
kannula nīrūbusūsi karam̐gi guṁḍĕlumom̐si
sannulabaṁṭĕ(ṭā?)yarā sarivalabu
vunnadim̐ movideniya luvviḽlūram̐gam̐ jŏchchĕ
yinniḍā nā joḍaidi vĕṁtabaṁṭoyim̐kanu

(||nāma||)
kalasi nīvadda nenu gaṭṭibīm̐ṭabai gūsuṁḍi
mŏlabaṁṭiyāyarā yimmulavalabu
kuligi śhrīvĕṁkaḍeśha kūḍidivi vayomada
mĕlimi maḍugulubbĕ nĕṁtabaṁṭoyim̐kanu