నా మనసెఱుఁగు దొల్లె ననిచినదానౌత
(॥పల్లవి॥)
నా మనసెఱుఁగు దొల్లె ననిచినదానౌత
కామించి యేఁచఁగవద్దు గక్కన రమ్మనవే
(॥నామ॥)
యెడమాట లాడించి యెంతపొద్దు జరపీనే
అడియాసలనే యెంత అలయించీనే
వుడివోనిచూపులను వురులొడ్డీ నిది యేమే
చిడియనివలపులఁ జిమ్మిరేఁగేదానను
(॥నామ॥)
మొగమొగా లెదుటను మోహ మెంతరేఁచీనే
నగవునఁ గాఁక లెట్టు నటియించీనే
పగటుఁజేఁతలు చూపి బయలేల యీఁదించీనే
మిగులాఁ దమకముల మించివున్నదానను
(॥నామ॥)
మన్ననలు నాకు విచ్చి మద మెంత యెక్కించీనే
కన్నుసన్నలనే యేమి గారవించీనే
వున్నది శ్రీవేంకటేశు డుద్దగిరికృష్ణుఁడై
నన్నుఁ గూడె తనపొందు నమ్మికైనదానను
(||pallavi||)
nā manasĕṟum̐gu dŏllĕ nanisinadānauda
kāmiṁchi yem̐sam̐gavaddu gakkana rammanave
(||nāma||)
yĕḍamāḍa lāḍiṁchi yĕṁtabŏddu jarabīne
aḍiyāsalane yĕṁta alayiṁchīne
vuḍivonisūbulanu vurulŏḍḍī nidi yeme
siḍiyanivalabulam̐ jimmirem̐gedānanu
(||nāma||)
mŏgamŏgā lĕduḍanu moha mĕṁtarem̐sīne
nagavunam̐ gām̐ka lĕṭṭu naḍiyiṁchīne
pagaḍum̐jem̐talu sūbi bayalela yīm̐diṁchīne
migulām̐ damagamula miṁchivunnadānanu
(||nāma||)
mannanalu nāgu vichchi mada mĕṁta yĕkkiṁchīne
kannusannalane yemi gāraviṁchīne
vunnadi śhrīveṁkaḍeśhu ḍuddagirikṛṣhṇum̐ḍai
nannum̐ gūḍĕ tanabŏṁdu nammigainadānanu