నా మన సేమిచూచేరే నడుమ నో చెలులాల
(॥పల్లవి॥)
నా మన సేమిచూచేరే నడుమ నో చెలులాల
ఆముకొని నా విభుని ఆత్మలో నుందానను
(॥నామ॥)
ప్రేమముగలవనిత ప్రియములు చెప్పుఁగాక
యేమైన రమణుని కెదురాడునా
కామించి వచ్చినది కడుబత్తిసేసుఁగాక
సామాన్యపుఁబనులకు సాదించునా
(॥నామ॥)
తగుచుట్టమైనది తలఁపులో వచ్చుఁగాక
వెగటుగా నడచిన వేసారునా
నగ వెరిఁగినది మిన్నక ఇయ్యకొనుఁగాక
యెగసక్కెమాడినా యీసడించునా
(॥నామ॥)
కడువితవరైతేను కాఁగిటఁ జొక్కించుఁగాక
యెడసినతప్పులెల్లా నెంచుకొనునా
బడి నలమేల్మంగను పతి శ్రీవేంకటేశుఁడు
తడయక నన్నేలేవింతటి గోరకుండు నా
(||pallavi||)
nā mana semisūsere naḍuma no sĕlulāla
āmugŏni nā vibhuni ātmalo nuṁdānanu
(||nāma||)
premamugalavanida priyamulu sĕppum̐gāga
yemaina ramaṇuni kĕdurāḍunā
kāmiṁchi vachchinadi kaḍubattisesum̐gāga
sāmānyabum̐banulagu sādiṁchunā
(||nāma||)
tagusuṭṭamainadi talam̐pulo vachchum̐gāga
vĕgaḍugā naḍasina vesārunā
naga vĕrim̐ginadi minnaga iyyagŏnum̐gāga
yĕgasakkĕmāḍinā yīsaḍiṁchunā
(||nāma||)
kaḍuvidavaraidenu kām̐giḍam̐ jŏkkiṁchum̐gāga
yĕḍasinadappulĕllā nĕṁchugŏnunā
baḍi nalamelmaṁganu padi śhrīveṁkaḍeśhum̐ḍu
taḍayaga nanneleviṁtaḍi goraguṁḍu nā