Naa mana semi sooseeni namtunam daane nenu

నా మన సేమి చూచీని నంటునఁ దానే నేను
Language

(॥పల్లవి॥)
నా మన సేమి చూచీని నంటునఁ దానే నేను
యేమి నన నిఁక నేల ఇంటికి రమ్మననే

(॥నా మన॥)
పాయని చుట్టరికము పరిసిపోదెంతైనా
నాయముతోడి నడక నమ్మవచ్చును
చేయి మీఁదిఇనచేఁత చెల్లుబడి గాక పోదు
యేయెడాఁ గొంకఁగనేల యింటికి రమ్మనవే

(॥నా మన॥)
మచ్చికతోడివలపు మానుపరా దెంతైనా
అచ్చలమైనసరస మాస రేఁచును
కొచ్చి కొచ్చి పెనఁగితే కూటములు చవివుట్టు
యెచ్చరిక సేయనేల యింటికి రమ్మనవే

(॥నా మన॥)
దట్టమైన వినయాలు దాఁగనియ్య వెంతైనా
నెట్టుకొన్న పొందులు నెరవేర్చును
జట్టిగొని శ్రీవేంకటేశ్వరుఁడు నన్నిపుడేలె
యిట్టె దిన దినమూ నింటికి రమ్మననే

(||pallavi||)
nā mana semi sūsīni naṁṭunam̐ dāne nenu
yemi nana nim̐ka nela iṁṭigi rammanane

(||nā mana||)
pāyani suṭṭarigamu parisibodĕṁtainā
nāyamudoḍi naḍaga nammavachchunu
seyi mīm̐diinasem̐ta sĕllubaḍi gāga podu
yeyĕḍām̐ gŏṁkam̐ganela yiṁṭigi rammanave

(||nā mana||)
machchigadoḍivalabu mānubarā dĕṁtainā
achchalamainasarasa māsa rem̐sunu
kŏchchi kŏchchi pĕnam̐gide kūḍamulu savivuṭṭu
yĕchchariga seyanela yiṁṭigi rammanave

(||nā mana||)
daṭṭamaina vinayālu dām̐ganiyya vĕṁtainā
nĕṭṭugŏnna pŏṁdulu nĕraversunu
jaṭṭigŏni śhrīveṁkaḍeśhvarum̐ḍu nannibuḍelĕ
yiṭṭĕ dina dinamū niṁṭigi rammanane