నా లాగు నీ వెఱఁగవు నన్ను నొరసేవు నేఁడు
(॥పల్లవి॥)
నా లాగు నీ వెఱఁగవు నన్ను నొరసేవు నేఁడు
ఆ లాగువాఁడవు గాన అయ్యో నీవు
(॥నాలా॥)
చెంగట నీకొక మొక్కు చేరి నేనే మొక్కి తేను
వెంగెములై తోఁచెనిదె వేరే నీకు
కంగిననీచేఁత లేమిగలిగినా దాఁతుఁగాక
అంగడివేతునా అయ్యో నేను
(॥నాలా॥)
చేపట్టి నిన్ను గోరఁ జెనకిసిగ్గువడితే
కోపములై తోఁచెనదే గురిగా నీకు
యేపనులు గలిగినా ఇయ్యకొందుఁగాకనిన్ను
ఆపాటికే దూరుదునా అయ్యో నేను
(॥నాలా॥)
వలచి కాఁగి నీతో వడిగాఁ బెనఁగి తేను
బలిమియై తోఁచె నిదే పైపై నీకు
కలితేఁ జలము శ్రీవేంకటేశ నీపైనా
అలరి కలతునా అయ్యో నేను
(||pallavi||)
nā lāgu nī vĕṟam̐gavu nannu nŏrasevu nem̐ḍu
ā lāguvām̐ḍavu gāna ayyo nīvu
(||nālā||)
sĕṁgaḍa nīgŏga mŏkku seri nene mŏkki tenu
vĕṁgĕmulai tom̐sĕnidĕ vere nīgu
kaṁginanīsem̐ta lemigaliginā dām̐tum̐gāga
aṁgaḍivedunā ayyo nenu
(||nālā||)
sebaṭṭi ninnu goram̐ jĕnagisigguvaḍide
kobamulai tom̐sĕnade gurigā nīgu
yebanulu galiginā iyyagŏṁdum̐gāganinnu
ābāḍige dūrudunā ayyo nenu
(||nālā||)
valasi kām̐gi nīdo vaḍigām̐ bĕnam̐gi tenu
balimiyai tom̐sĕ nide paibai nīgu
kalidem̐ jalamu śhrīveṁkaḍeśha nībainā
alari kaladunā ayyo nenu