నా కితఁడు మోహించి నావద్దనే వుండఁగాను
(॥పల్లవి॥)
నా కితఁడు మోహించి నావద్దనే వుండఁగాను
యీ కడ నీ వేఁకరేవు యెంత జాణతనము
(॥నాకి॥)
కచ్చు పెట్టుక పతికిఁ గంకణము గట్టవే
ముచ్చటదీరఁగ నీమోము చూపవే
నవిడితోవచ్చి వీడెము చేతికియ్యవే
ఇచ్చట నచ్చటనుండి యేమి దొంగిచూచేవు
(॥నాకి॥)
అంతే బత్తిగలిగితే నన్నిసేవలుఁ జేయవే
మంతనాన కిటువచ్చి మాటలాడవే
వింతలుగా నవ్వు వేడుకలు చూపవే
తక్కక యెందాఁకాను తగిలి మొక్కేవు
(॥నాకి॥)
అక్క రగలదానవు అక్కునఁ గట్టుకొనవే
చొక్కించి చుట్టరికము చూపఁగదవే
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
తక్కక యెందాఁకాను తగిలి మొక్కేవు
(||pallavi||)
nā kidam̐ḍu mohiṁchi nāvaddane vuṁḍam̐gānu
yī kaḍa nī vem̐karevu yĕṁta jāṇadanamu
(||nāgi||)
kachchu pĕṭṭuga padigim̐ gaṁkaṇamu gaṭṭave
muchchaḍadīram̐ga nīmomu sūbave
naviḍidovachchi vīḍĕmu sedigiyyave
ichchaḍa nachchaḍanuṁḍi yemi dŏṁgisūsevu
(||nāgi||)
aṁte battigaligide nannisevalum̐ jeyave
maṁtanāna kiḍuvachchi māḍalāḍave
viṁtalugā navvu veḍugalu sūbave
takkaga yĕṁdām̐kānu tagili mŏkkevu
(||nāgi||)
akka ragaladānavu akkunam̐ gaṭṭugŏnave
sŏkkiṁchi suṭṭarigamu sūbam̐gadave
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
takkaga yĕṁdām̐kānu tagili mŏkkevu