నా కేల నేరుపవచ్చినాఁడు తాను
(॥పల్లవి॥)
నా కేల నేరుపవచ్చినాఁడు తాను
చేకొని యెప్పుడుఁ దనచిత్తములో దానను
(॥నాకేల॥)
తగవులఁ బెట్టేది తరితీపు సేసేది
మగనాలిసేఁతలా మాపుదాఁకాను
వెగటుగా నవ్వేది వెంగెముతో నుండేది
అగడు సేసేటివెలయాండ్లకుఁ గాక
(॥నాకేల॥)
పల్లదాన సొలసేది పంతములు మెరసేది
యీల్లాలివిద్యలు యివి యల్లాను
వెల్లివిరై చెనకేది వేమారుఁ బెనఁగేది
చిల్లరసాధారణపుచెలులకుఁ గాక
(॥నాకేల॥)
వరుసకు బిలిచేది వాడికేలు చూపేది
గరితెలగుణమా కను గొంటేను
యిరవై శ్రీవేంకటేశు డే నలమేల్మంగను
సరి గూడె నితరాలు జారులే కాకా
(||pallavi||)
nā kela nerubavachchinām̐ḍu tānu
segŏni yĕppuḍum̐ danasittamulo dānanu
(||nāgela||)
tagavulam̐ bĕṭṭedi taridību sesedi
maganālisem̐talā mābudām̐kānu
vĕgaḍugā navvedi vĕṁgĕmudo nuṁḍedi
agaḍu seseḍivĕlayāṁḍlagum̐ gāga
(||nāgela||)
palladāna sŏlasedi paṁtamulu mĕrasedi
yīllālividyalu yivi yallānu
vĕllivirai sĕnagedi vemārum̐ bĕnam̐gedi
sillarasādhāraṇabusĕlulagum̐ gāga
(||nāgela||)
varusagu bilisedi vāḍigelu sūbedi
garidĕlaguṇamā kanu gŏṁṭenu
yiravai śhrīveṁkaḍeśhu ḍe nalamelmaṁganu
sari gūḍĕ nidarālu jārule kāgā