Naa dikku soosi neevu navvulemta navvevu

నా దిక్కు చూచి నీవు నవ్వులెంత నవ్వేవు
Language

(॥పల్లవి॥)
నా దిక్కు చూచి నీవు నవ్వులెంత నవ్వేవు
దాదాత నీలోని తలఁపు లేడేరెను

(॥నాది॥)
సలిగె గలదానవు సరసములాడఁగదే
కొలువైవున్నాఁ డతఁడు కొంకఁగనేల
చెలుల మాఁటున నుండి సిగ్గువడ నేమిటికి
వెలయఁగ వలపులు నెల్లవిరులాయను

(॥నాది॥)
చుట్టమవైనదానవు సుద్దులు చెప్పఁ గదవే
యిట్టె నీఇంటికి వచ్చె నెరవులేల
వట్టి సన్నలుఁ జాయలు వల దిందరిముందర
తెట్టెలైన మీ పొందులు తేటతెల్లమాయను

(॥నాది॥)
తగులుగల దానవు దండఁ గూచుండఁగదవే
మొగముచూచి నిన్నేలె మొరఁగులేల
తగు శ్రీ వేంకటేశుఁడు తానే నిన్నూ నన్నూ నేలె
జిగిమించి యీ కతలు చెప్పఁగొత్తలాయను

(||pallavi||)
nā dikku sūsi nīvu navvulĕṁta navvevu
dādāda nīloni talam̐pu leḍerĕnu

(||nādi||)
saligĕ galadānavu sarasamulāḍam̐gade
kŏluvaivunnām̐ ḍadam̐ḍu kŏṁkam̐ganela
sĕlula mām̐ṭuna nuṁḍi sigguvaḍa nemiḍigi
vĕlayam̐ga valabulu nĕllavirulāyanu

(||nādi||)
suṭṭamavainadānavu suddulu sĕppam̐ gadave
yiṭṭĕ nīiṁṭigi vachchĕ nĕravulela
vaṭṭi sannalum̐ jāyalu vala diṁdarimuṁdara
tĕṭṭĕlaina mī pŏṁdulu teḍadĕllamāyanu

(||nādi||)
tagulugala dānavu daṁḍam̐ gūsuṁḍam̐gadave
mŏgamusūsi ninnelĕ mŏram̐gulela
tagu śhrī veṁkaḍeśhum̐ḍu tāne ninnū nannū nelĕ
jigimiṁchi yī kadalu sĕppam̐gŏttalāyanu