Muyigi muyaaya nide muchchada liddarigini

ముయికి ముయాయ నిదే ముచ్చట లిద్దరికిని
Language

(॥పల్లవి॥)
ముయికి ముయాయ నిదే ముచ్చట లిద్దరికిని
నయముల విూ యెడకు నవ్వు లేమి నవ్వము

(॥ముయికి॥)
చింతాజలధిలోన చెలి పవళించె నాడ
పంతమునఁ బాలవెల్లిఁ బవ్వళించితివి నీవు
వంతునకు వంతాయ వగవఁగాఁ బని లేదు
యెంత కెంత యిఁక మీతో యెడమాట లాడము

(॥ముయికి॥)
విరహనలములోన వెలఁదికి నిరవాయ
అరిది రవిమండల మదే నీకు నిరవాయ
సరికి సరి యాయ మిమ్ము సాధింపఁ బనిలేదు
తరమిడి నిక మిమ్ము తగుఁ దగ దనము

(॥ముయికి॥)
రచనల యింతి మనోరథములకొండ లెక్కె
నిచట శ్రీవేంకటాద్రి యెక్కితి వీవు
పచరించ సమరతిబంధము లిద్దరి కాయ
యెచటా దేవుఁడవు నిన్ను యెన్నడును దూరము

(||pallavi||)
muyigi muyāya nide muchchaḍa liddarigini
nayamula viూ yĕḍagu navvu lemi navvamu

(||muyigi||)
siṁtājaladhilona sĕli pavaḽiṁchĕ nāḍa
paṁtamunam̐ bālavĕllim̐ bavvaḽiṁchidivi nīvu
vaṁtunagu vaṁtāya vagavam̐gām̐ bani ledu
yĕṁta kĕṁta yim̐ka mīdo yĕḍamāḍa lāḍamu

(||muyigi||)
virahanalamulona vĕlam̐digi niravāya
aridi ravimaṁḍala made nīgu niravāya
sarigi sari yāya mimmu sādhiṁpam̐ baniledu
taramiḍi niga mimmu tagum̐ daga danamu

(||muyigi||)
rasanala yiṁti manorathamulagŏṁḍa lĕkkĕ
nisaḍa śhrīveṁkaḍādri yĕkkidi vīvu
pasariṁcha samaradibaṁdhamu liddari kāya
yĕsaḍā devum̐ḍavu ninnu yĕnnaḍunu dūramu