Muttivachchina panigi mokkenayyaa

ముట్టివచ్చిన పనికి మొక్కేనయ్యా
Language

(॥పల్లవి॥)
ముట్టివచ్చిన పనికి మొక్కేనయ్యా
జట్టిగొంటి విన్నిటాను జగడము లేఁటికి

(॥ముట్టి॥)
పంతము నాచేతిది బలిమి నీచేతిది
ఇంతినిదె కంటి నెక్కుడా నేను
వింతదాన నేఁగాను విడువఁగరాదు నీవు
యెంతకెంత రావయ్య ఇఁకనేల అలుక

(॥ముట్టి॥)
తగవు నావొళ్ళిది దయ నీకుఁ గలదే
మగువ నిదివో నేను మారాడేనా
వెగటాడ నే నీతొ వెక్కసము లేదు నీకు
తగు నిఁక లేవయ్య తలపోఁత లేఁటికి

(॥ముట్టి॥)
ఫలమెల్లా నాసొమ్ము పైపైనవ్వులు నీవి
అలమేలుమంగ నేను అడ్డమున్నదా
యెలమి శ్రీవేంకటేశ యిద్దరముఁ గూడితిమి
చెలఁగితి నుండవయ్య సేసన్నలేఁటికి

(||pallavi||)
muṭṭivachchina panigi mŏkkenayyā
jaṭṭigŏṁṭi vinniḍānu jagaḍamu lem̐ṭigi

(||muṭṭi||)
paṁtamu nāsedidi balimi nīsedidi
iṁtinidĕ kaṁṭi nĕkkuḍā nenu
viṁtadāna nem̐gānu viḍuvam̐garādu nīvu
yĕṁtagĕṁta rāvayya im̐kanela aluga

(||muṭṭi||)
tagavu nāvŏḽḽidi daya nīgum̐ galade
maguva nidivo nenu mārāḍenā
vĕgaḍāḍa ne nīdŏ vĕkkasamu ledu nīgu
tagu nim̐ka levayya talabom̐ta lem̐ṭigi

(||muṭṭi||)
phalamĕllā nāsŏmmu paibainavvulu nīvi
alamelumaṁga nenu aḍḍamunnadā
yĕlami śhrīveṁkaḍeśha yiddaramum̐ gūḍidimi
sĕlam̐gidi nuṁḍavayya sesannalem̐ṭigi