Muttidino muttano mukkunane kobagimchi

ముట్టితినో ముట్టనో ముక్కుననే కోపగించి
Language

(॥పల్లవి॥)
ముట్టితినో ముట్టనో ముక్కుననే కోపగించి
చిట్టికాల కేమైనాఁ జేయు మనరాదా

(॥ముట్టితి॥)
ఆయము లంటకు మని అంటినో అననో
దాయవలె ననుఁ జూచి తప్పక మోము
వోయమ్మ తా నిదేమే వూరకే సాదించవచ్చి
సేయవలసినవెల్లాఁ జేయు మనరాదా

(॥ముట్టితి॥)
బింకమాడకుండ నానవెట్టితినో వెట్టనో
అంకగానివలె నన్ను నఱ్ఱదిమాని
యింకా మానడోఁ యమ్మ యేడనైనా దమకించి
అంకె వచ్చినట్టు నన్ను నను మనరాదా

(॥ముట్టితి॥)
నాటుకొన్నరతివేళ నవ్వితినో నవ్వనొ
పోటుబంటువలె గోర బుజ వేసీని
యేటి కింక నోయమ్మ యిదె శ్రీవేంకటపతి
చాటువగ ననుఁ గూడెఁ జోలు ననరాదా

(||pallavi||)
muṭṭidino muṭṭano mukkunane kobagiṁchi
siṭṭigāla kemainām̐ jeyu manarādā

(||muṭṭidi||)
āyamu laṁṭagu mani aṁṭino anano
dāyavalĕ nanum̐ jūsi tappaga momu
voyamma tā nideme vūrage sādiṁchavachchi
seyavalasinavĕllām̐ jeyu manarādā

(||muṭṭidi||)
biṁkamāḍaguṁḍa nānavĕṭṭidino vĕṭṭano
aṁkagānivalĕ nannu naṭradimāni
yiṁkā mānaḍom̐ yamma yeḍanainā damagiṁchi
aṁkĕ vachchinaṭṭu nannu nanu manarādā

(||muṭṭidi||)
nāḍugŏnnaradiveḽa navvidino navvanŏ
poḍubaṁṭuvalĕ gora buja vesīni
yeḍi kiṁka noyamma yidĕ śhrīveṁkaḍabadi
sāḍuvaga nanum̐ gūḍĕm̐ jolu nanarādā