Muttagu muttagu mokkenu

ముట్టకు ముట్టకు మొక్కేను
Language

(॥పల్లవి॥)
ముట్టకు ముట్టకు మొక్కేను
చుట్టపువరుసల చూపులె చాలు

(॥ముట్టి॥)
నెయ్యము నీతో నెరపఁగఁ గుచములు
అయ్యెడ జగడము లడిచీని
వొయ్యనె చెనకకు వొమ్మదు మాకిది
ముయ్యడ మాటల ముచ్చటె చాలు

(॥ముట్టి॥)
నంటున నీతో నవ్వఁగఁ జూపులు
పెంటల నూరక బెదరీని
వొంటదు యింతేసి కోపము నే మిటు
జంటలఁ బై పైసరసమె చాలు

(॥ముట్టి॥)
కాఁగిట నే నిటు కలయఁగఁ గలయఁగ
మాఁగి నాతనువు మఱచీని
ఆఁగుచు శ్రీవేంకటాధిప కూడితి
మూఁగి చవిగొనేటి మోవులె చాలు

(||pallavi||)
muṭṭagu muṭṭagu mŏkkenu
suṭṭabuvarusala sūbulĕ sālu

(||muṭṭi||)
nĕyyamu nīdo nĕrabam̐gam̐ gusamulu
ayyĕḍa jagaḍamu laḍisīni
vŏyyanĕ sĕnagagu vŏmmadu māgidi
muyyaḍa māḍala muchchaḍĕ sālu

(||muṭṭi||)
naṁṭuna nīdo navvam̐gam̐ jūbulu
pĕṁṭala nūraga bĕdarīni
vŏṁṭadu yiṁtesi kobamu ne miḍu
jaṁṭalam̐ bai paisarasamĕ sālu

(||muṭṭi||)
kām̐giḍa ne niḍu kalayam̐gam̐ galayam̐ga
mām̐gi nādanuvu maṟasīni
ām̐gusu śhrīveṁkaḍādhiba kūḍidi
mūm̐gi savigŏneḍi movulĕ sālu