Muribemulellaa neemumdarane pasarimchee

మురిపెములెల్లా నీముందరనే పచరించీ
Language

(॥పల్లవి॥)
మురిపెములెల్లా నీముందరనే పచరించీ
నెరవాదితనమెంత నేరుచునో తాను

(॥మురి॥)
కట్టుకొనె మెడనిండా గట్టి ముత్తెపు సరులు
పెట్టుకొనెఁ గొప్పన సంపెంగవిరులు
దట్టముగఁ బయ్యదలో దాఁచెను కుచగిరులు
అట్టె చిత్తగించి చూడవయ్యా యీపెదిక్కు

(॥మురి॥)
పూసెను గందము మేన పొంచి నెరపూఁతను
ఆసలనే చూపీ నొయ్యారి చేఁతలు
వేసరక మొరయించీ వెస మట్టెల మోఁతలు
సేసవెట్టి యేలవయ్యా చెలి నీకుఁ గలిగె

(॥మురి॥)
మెలుపున నించుకొనె యేనెల్లా సొమ్ములు
కులికీ వీణెలోఁ గొనగోరి చిమ్ములు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
పిలిచి మాఁటడవయ్య ప్రియురాలు నీకు

(||pallavi||)
muribĕmulĕllā nīmuṁdarane pasariṁchī
nĕravādidanamĕṁta nerusuno tānu

(||muri||)
kaṭṭugŏnĕ mĕḍaniṁḍā gaṭṭi muttĕbu sarulu
pĕṭṭugŏnĕm̐ gŏppana saṁpĕṁgavirulu
daṭṭamugam̐ bayyadalo dām̐sĕnu kusagirulu
aṭṭĕ sittagiṁchi sūḍavayyā yībĕdikku

(||muri||)
pūsĕnu gaṁdamu mena pŏṁchi nĕrabūm̐tanu
āsalane sūbī nŏyyāri sem̐talu
vesaraga mŏrayiṁchī vĕsa maṭṭĕla mom̐talu
sesavĕṭṭi yelavayyā sĕli nīgum̐ galigĕ

(||muri||)
mĕlubuna niṁchugŏnĕ yenĕllā sŏmmulu
kuligī vīṇĕlom̐ gŏnagori simmulu
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
pilisi mām̐ṭaḍavayya priyurālu nīgu