మునులాల జనులాల ముంచిన దేవతలాల
(॥పల్లవి॥)
మునులాల జనులాల ముంచిన దేవతలాల
పనివూని మొక్కరో పరమాత్మునికి
(॥మును॥)
కనకాచలమువంటి ఘనదివ్యరథముపై
వనజాక్షుఁ డెక్కి వీధి వచ్చీ వాఁడె
వెనుదళమై నడచె విష్వక్సేనుఁ డిదె దేవిడి
కని మని సేవించరో కన్నులపండుగలు
(॥మును॥)
గగనవాహినివంటి గరుడధ్వజముతోడ
అగడై వీధి నేఁగే చక్రాయుధుఁడు
పగటు విజయముతో పాంచజన్యము వట్టీని
నిగిడికొని యాడరొ నిచ్చకల్యాణములు
(॥మును॥)
వరుస భాగ్యదేవతవంటి యలమేలుమంగ
వురమెక్కఁగ శ్రీ వేంకటోత్తముఁడు
తిరమై నెలవుకొనె దివ్యనగరులోనను
శరణని బదుకరో సాక్షాత్కరమున
(||pallavi||)
munulāla janulāla muṁchina devadalāla
panivūni mŏkkaro paramātmunigi
(||munu||)
kanagāsalamuvaṁṭi ghanadivyarathamubai
vanajākṣhum̐ ḍĕkki vīdhi vachchī vām̐ḍĕ
vĕnudaḽamai naḍasĕ viṣhvaksenum̐ ḍidĕ deviḍi
kani mani seviṁcharo kannulabaṁḍugalu
(||munu||)
gaganavāhinivaṁṭi garuḍadhvajamudoḍa
agaḍai vīdhi nem̐ge sakrāyudhum̐ḍu
pagaḍu vijayamudo pāṁchajanyamu vaṭṭīni
nigiḍigŏni yāḍarŏ nichchagalyāṇamulu
(||munu||)
varusa bhāgyadevadavaṁṭi yalamelumaṁga
vuramĕkkam̐ga śhrī veṁkaḍottamum̐ḍu
tiramai nĕlavugŏnĕ divyanagarulonanu
śharaṇani badugaro sākṣhātkaramuna