Munugonna siggulado momu vamcha nemidige

మునుకొన్న సిగ్గులతో మోము వంచ నేమిటికే
Language

(॥పల్లవి॥)
మునుకొన్న సిగ్గులతో మోము వంచ నేమిటికే
దిన దిన భోగముల తెప్పఁదేలగదే

(॥మును॥)
చెలుములు సేయఁగానే చిగిరించు మోహములు
పలుకులవల్లఁ గొంత పదనెక్కును
సెలవుల నవ్వులను చిత్తములు గరఁగును
కొలువులు సేసి పతిఁ గొసరఁగఁగదవే

(॥మును॥)
సరసము లాడఁగానే చవులెల్లా నుప్పతిలు
మరిగించుకొంటేను మర్మము లంటు
సరి నెదురు చూపుల జడిగొను వేడుకలు
బెరసి విభుని రతిఁ బెడరేఁచఁగదవే

(॥మును॥)
చన్నుల నొరయఁగానే సంతోసా లొనఁగూడు
సన్నలా చాయలనే యాసలు వుట్టును
ఇన్నిటా శ్రీవేంకటేశుఁ డిట్టె వచ్చి నిన్నుఁ గూడె
పన్నుక యీతని నెడవాయకుండఁగదవే

(||pallavi||)
munugŏnna siggulado momu vaṁcha nemiḍige
dina dina bhogamula tĕppam̐delagade

(||munu||)
sĕlumulu seyam̐gāne sigiriṁchu mohamulu
palugulavallam̐ gŏṁta padanĕkkunu
sĕlavula navvulanu sittamulu garam̐gunu
kŏluvulu sesi padim̐ gŏsaram̐gam̐gadave

(||munu||)
sarasamu lāḍam̐gāne savulĕllā nuppadilu
marigiṁchugŏṁṭenu marmamu laṁṭu
sari nĕduru sūbula jaḍigŏnu veḍugalu
bĕrasi vibhuni radim̐ bĕḍarem̐sam̐gadave

(||munu||)
sannula nŏrayam̐gāne saṁtosā lŏnam̐gūḍu
sannalā sāyalane yāsalu vuṭṭunu
inniḍā śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ vachchi ninnum̐ gūḍĕ
pannuga yīdani nĕḍavāyaguṁḍam̐gadave