మునుపనే వేఁడుకొని మొక్కితి నీకు
(॥పల్లవి॥)
మునుపనే వేఁడుకొని మొక్కితి నీకు
వొనరి మన్నించుమీ నా వొద్ద బాయక నీవు
(॥మును॥)
మనసునఁ దలఁచుమీ మరి నా విన్నపములు
పనులెన్ని గలిగినాఁ బరాకు గాక
కనుకొమ్మీ ముందర నేకావించు సేవలెల్లా
అనుమానించకుమీ నీ వప్పు డెందుండినాను
(॥మును॥)
మఱవకుమీ నా మచ్చిక చుట్టరికము
జఱసి సంపద లెంత సందడించినా
గురుతువెట్టుకుండు మీ గుబ్బితిల్లు నావలపు
తఱచు సతులెందరిఁ దగిలినాను
(॥మును॥)
యెంచుకొమ్మీ నా కాఁగిటి యెరవులేనిరతులు
పొంచి యేకాంతాన వినోదించేటి వేళ
అంచెల శ్రీవేంకటేశ అట్టే నన్నుఁ గూడితివి
కొంచకుమీనీ కెంత గుట్టు గలిగినాను
(||pallavi||)
munubane vem̐ḍugŏni mŏkkidi nīgu
vŏnari manniṁchumī nā vŏdda bāyaga nīvu
(||munu||)
manasunam̐ dalam̐sumī mari nā vinnabamulu
panulĕnni galiginām̐ barāgu gāga
kanugŏmmī muṁdara negāviṁchu sevalĕllā
anumāniṁchagumī nī vappu ḍĕṁduṁḍinānu
(||munu||)
maṟavagumī nā machchiga suṭṭarigamu
jaṟasi saṁpada lĕṁta saṁdaḍiṁchinā
guruduvĕṭṭuguṁḍu mī gubbidillu nāvalabu
taṟasu sadulĕṁdarim̐ dagilinānu
(||munu||)
yĕṁchugŏmmī nā kām̐giḍi yĕravuleniradulu
pŏṁchi yegāṁtāna vinodiṁcheḍi veḽa
aṁchĕla śhrīveṁkaḍeśha aṭṭe nannum̐ gūḍidivi
kŏṁchagumīnī kĕṁta guṭṭu galiginānu