మునుపఁ బదరితేను వెనక వేఁడుకోవలె
(॥పల్లవి॥)
మునుపఁ బదరితేను వెనక వేఁడుకోవలె
ఘనుఁ డేమి సేసినానుఁ గైకొనుటే మేలు
(॥మును॥)
కొలువు సతులతోడ కొచ్చికొచ్చి నవ్వెనంటా
చలపట్టి పతి నెంత సాదించేవే
అలరి నాటకసాల యాలలు చూచెనంటా
వెలయ నేఁ డెంతలేసి వెంగే లాడేవే
(॥మును॥)
యెరవుల కాంతలను యింటికిఁ దెచ్చెనంటాను
సరికి బేసికి నెంత జంకించేవే
పోరుగిరుగులవారి పొందులు మరిగెనంటా
పురిగొన నిమ్మపంటఁ బూఁచి యేల వేసేవే
(॥మును॥)
వూడిగాల చెలులతో వొంటిమాటలాడెనంటా
వాడలోన నేఁటికి రవ్వలు సేసేవే
యీడనె శ్రీవేంకటేశఁ గింతలోనే నిన్నుఁ గూడె
జాడతో నీతని నేమి సంతోసించేవే
(||pallavi||)
munubam̐ badaridenu vĕnaga vem̐ḍugovalĕ
ghanum̐ ḍemi sesinānum̐ gaigŏnuḍe melu
(||munu||)
kŏluvu saduladoḍa kŏchchigŏchchi navvĕnaṁṭā
salabaṭṭi padi nĕṁta sādiṁcheve
alari nāḍagasāla yālalu sūsĕnaṁṭā
vĕlaya nem̐ ḍĕṁtalesi vĕṁge lāḍeve
(||munu||)
yĕravula kāṁtalanu yiṁṭigim̐ dĕchchĕnaṁṭānu
sarigi besigi nĕṁta jaṁkiṁcheve
porugirugulavāri pŏṁdulu marigĕnaṁṭā
purigŏna nimmabaṁṭam̐ būm̐si yela veseve
(||munu||)
vūḍigāla sĕlulado vŏṁṭimāḍalāḍĕnaṁṭā
vāḍalona nem̐ṭigi ravvalu seseve
yīḍanĕ śhrīveṁkaḍeśham̐ giṁtalone ninnum̐ gūḍĕ
jāḍado nīdani nemi saṁtosiṁcheve