Munne vedaalu bhoomi mosuga vunnaamdavu

మున్నే వేదాలు భూమి మోచుక వున్నాఁడవు
Language

(॥పల్లవి॥)
మున్నే వేదాలు భూమి మోచుక వున్నాఁడవు
మొన్న నిన్నటి మాటలు మోవఁగలవా

(॥మున్నే॥)
పన్నీరే చల్లుకొనేవు పదనెక్కీ వలపులు
పిన్నపిన్న ససులొత్తి పెరిగీఁ జుమ్మీ
కన్నెలు పదారువేలు గలవాఁడవు మొదల
చన్నులపంటరాసులు సరి మోవఁగలవా

(॥మున్నే॥)
పూసేవు కప్పురధూళి పొది యెక్కీఁ గోరికలు
ఆసలఁ దీగెలువారి యలమీఁ జుమ్మీ
బేసబెల్లి గొల్లెతలు పెక్కులు గలవాఁడవు
సేసపంట పిడికెళ్లు చేరి మోవఁగలవా

(॥మున్నే॥)
తట్టుపుణుఁ గలదుక తాళిగా నలమేల్మంగఁ
గట్టుకొంటి బంతిరతే కంకేయఁ జుమ్మీ
యిట్టే శ్రీవేంకటేశ యెనమండ్రమగఁడవు
చెట్టడువఁ జేటఁడేసి సిగ్గు మోవఁగలవా

(||pallavi||)
munne vedālu bhūmi mosuga vunnām̐ḍavu
mŏnna ninnaḍi māḍalu movam̐galavā

(||munne||)
pannīre sallugŏnevu padanĕkkī valabulu
pinnabinna sasulŏtti pĕrigīm̐ jummī
kannĕlu padāruvelu galavām̐ḍavu mŏdala
sannulabaṁṭarāsulu sari movam̐galavā

(||munne||)
pūsevu kappuradhūḽi pŏdi yĕkkīm̐ gorigalu
āsalam̐ dīgĕluvāri yalamīm̐ jummī
besabĕlli gŏllĕdalu pĕkkulu galavām̐ḍavu
sesabaṁṭa piḍigĕḽlu seri movam̐galavā

(||munne||)
taṭṭubuṇum̐ galaduga tāḽigā nalamelmaṁgam̐
gaṭṭugŏṁṭi baṁtirade kaṁkeyam̐ jummī
yiṭṭe śhrīveṁkaḍeśha yĕnamaṁḍramagam̐ḍavu
sĕṭṭaḍuvam̐ jeḍam̐ḍesi siggu movam̐galavā